Mera Bill Mera Adhikar: Center new scheme.. Ask for bill and upload it.. Rs. Win crores.. even prize money every month!
Mera Bill Mera Adhikar: కేంద్రం కొత్త స్కీమ్.. బిల్ అడిగి అప్‌లోడ్ చేయండి.. రూ. కోటి గెల్చుకోండి.. నెలనెలా ప్రైజ్‌మనీలు కూడా!
Mera Bill Mera Adhikar Scheme: వినియోగదారులు తాము జరిపే కొనుగోళ్లకు విక్రయదారుల నుంచి రశీదు అడగడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్రం కొత్త స్కీం లాంఛ్ చేయనుంది. ఇదే మేరా బిల్ మేరా అధికార్ జీఎస్‌టీ రివార్డ్ పథకం. దీంట్లో కోటి రూపాయల వరకు బహుమతి గెల్చుకోవచ్చు. ఈ వివరాలు చూద్దాం.
GST Reward Scheme: కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రారంభించనుంది. ఎవరైనా వినియోగదారులు.. ఏదైనా కొనుగోలు చేసినప్పుడు విక్రేతల దగ్గర నుంచి రశీదు అడగటం ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆ ఉద్దేశంతో.. Mera Bill మేరా అధికార్ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి క్వార్టర్‌లోనూ అంటే 3 నెలలకు ఓసారి లక్కీ డ్రా నిర్వహించి.. రూ. కోటి చొప్పున రెండు బంపర్ బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి.. మొతం 12 నెలల కాలానికి పైలట్ ప్రాజెక్టులో (ప్రయోగాత్మకంగా) భాగంగా ఈ కార్యక్రమం ప్రారంభించనుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రతి నెలా లక్కీ డ్రాలో 800 GST రశీదుల్ని ఎంపిక చేసి.. రూ. 10 వేల చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు తెలిపింది ఆర్థిక శాఖ. లక్కీడ్రాలోనే సెలక్ట్ చేసిన మరో 10 రశీదులకు కూడా రూ. 10 లక్షల చొప్పున అందించనున్నట్లు పేర్కొంది.
ఈ బహుమతుల కోసం త్రైమాసికానికి ఒకసారి డ్రా తీస్తారు. దీని కోసం గత 3 నెలల నుంచి బంపర్ డ్రా.. నెలలో 5వ తేదీ వరకు అప్‌లోడ్ చేసిన రశీదుల నుంచి విజేత ఎవరో ఎంపిక చేస్తారు. వినియోగదారుల్లో రశీదు అడగాలనే సంస్కృతి పెంపొందించే ఉద్దేశంలో భాగంగానే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆర్థిక శాఖ వివరించింది.
అసోం, గుజరాత్, హరియాణా సహా కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, దమన్ దీవ్‌ల్లో దీనిని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
డ్రా కు అర్హత ఎలా పొందాలంటే?
- ముందటి నెలలో ఇచ్చిన B2C రశీదులన్నింటినీ ఆ తర్వాత నెల 5వ తేదీ కల్లా అప్‌లోడ్ చేస్తే.. నెలవారీ డ్రాకు అర్హత లభిస్తుంది.
- నెలలో గరిష్టంగా ఒక వ్యక్తి 25 రశీదుల్ని అప్‌లోడ్ చేయొచ్చు.
- ఈ బిల్స్‌ను మేరా బిల్ మేరా అధికార్.. మొబైల్ అప్లికేషన్‌లో లేదా Web.merabill.gst.gov.in అనే వెబ్‌పోర్టల్‌లోనూ అప్‌లోడ్ చేయొచ్చు.
- లక్కీ డ్రాకు అర్హత పొందాలంటే.. బిల్స్ విలువ కనీసం రూ.200 గా నిర్ణయించారు.
- GST నమోదిత సరఫరాదారుల నుంచి వినియోగదారులు తీసుకున్న రశీదుల్ని మాత్రమే డ్రా కు పరిగణనలోకి తీసుకుంటారు.
- రశీదు అప్‌లోడ్ చేసే టైంలో.. సరఫరాదారు GST గుర్తింపు నంబర్, రశీదు నంబర్, రశీదు తేదీ.. బిల్ విలువ, వినియోగదారు రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
డ్రాలో విజేతగా ఎంపికైన వాళ్లు.. ఎంపికైనట్లుగా సమాచారం వచ్చిన డేట్ నుంచి 30 రోజుల్లో యాప్/వెబ్‌పోర్టల్ నుంచి తమ పాన్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వంటి అదనపు వివరాలు తెలియజేయాలి. ఈ వివరాలతో ఆ విజేతకు బహుమతి మొత్తం పంపిస్తామని తెలిపింది ఆర్థిక శాఖ.
COMMENTS