Aadhaar: Lost your Aadhaar card.. No number? No tension.. Download it!
Aadhaar: మీ ఆధార్ కార్డు పోయిందా.. నంబర్ కూడా లేదా? నో టెన్షన్.. డౌన్‌లోడ్ చేసుకోండిలా!
Aadhaar: ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి చిన్న పనికి ఇప్పుడు ఆధార్ తప్పనిసరిగా మారిపోయింది. మరి అలాంటి ఆధార్ కార్డు కనిపించకుండా పోతే ఎలా? నంబర్ కూడా లేకపోతే ఆందోళన చెందాల్సిన పరిస్థితి. అయితే అలాంటి ఆందోళనే అవసరం లేదు. మీరు ఈజీగా ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Aadhaar: ఆధార్ కార్డు.. ఇప్పుడు దేశ ప్రజల జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఏ చిన్న ఆర్థిక లావాదేవీ పూర్తి చేయాలన్నా ఉండాల్సిందే. ఇప్పుడు గుర్తింపు కార్డు అంటే ఆధార్ ఒక్కటే అనే విధంగా మారిపోయింది. అయితే, ఇలాంటి ముఖ్యమైన ఆదార్ కార్డు కనిపించకుండా పోతే, ఎక్కడో పెట్టి మర్చిపోతే, అత్యవసరంగా కావాల్సి వచ్చినప్పుడు ఆందోళన చెందాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ పెట్టామో గుర్తుకు రాదు. నంబర్ కూడా అందుబాటులో ఉండదు. దీంతో ప్రభుత్వ పథకాలు ఆగిపోయే ప్రమాదం ఉంటుందేమోననే ఆలోచన మనుసులోకి వచ్చేస్తుంది. అయితే, మీరు ఆ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఉంది. ఆధార్ కార్డు పోగొట్టుకున్నా, నంబర్ కూడా లేకపోయినా ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐటీ సాయంతో ఇ-ఆధార్ పొందవచ్చు. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ రెండూ ఉండక పోతే పరిస్థితి ఏమిటి? అంటే ఈ సమస్యకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మరో పరిష్కార మార్గాన్ని చూపించింది. ఆధార్ కార్డు నంబర్, ఎన్‌రోల్‌మెంట్ నంబర్ లేకపోయినా సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని తీసుకొచ్చింది.
ఎన్‌రోల్‌మెంట్ ఐడీ తెలుసుకోవడం ఎలా?
- ఎన్‌రోల్‌మెంట్ ఐడీ కోసం యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి. ఆ తర్వాత గేట్ ఆధార్ ఆప్షన్ ఎంచుకోవాలి.
- తర్వాత ఓపెన్ అయ్యే విండోలో ఎన్‌రోల్‌మెంట్ ఐటీ రిట్రైవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
- తర్వాత అక్కడ అడిగిన సమచారాన్ని నమోదు చేసి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
- ఆ తర్వాత మీ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ నంబర్ కంప్యూటర్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
ఇ-ఆదార్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
- మీరు మీ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ తెలుసుకున్న తర్వాత ఈజీగా ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- యూఐడీఏఐ వెబ్‌సైట్ లోకి వెళ్లి డౌన్‌లోడ్ ఇ-ఆధార్ ఆప్షన్ ఎంచుకోవాలి.
- ఆ తర్వాత మీ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని నమోదు చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ కు వచ్చిన ఓటీపీ ని ఎంటర్ చేసి ఈజీగా ఇ- ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
COMMENTS