Loan Apps: Are you applying for loans on private apps? TAKECARE! If you don't know these things, you will lose a lot.
Loan Apps: ప్రైవేటు యాప్‌లలో లోన్లకు అప్లై చేస్తున్నారా? జరభద్రం! ఈ విషయాలను తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు..
భారతదేశంలో డిజిటల్ లెండింగ్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. కొత్త తరం ఫిన్ టెక్ స్టార్టప్ లు పెద్ద సంఖ్యలో ఉద్భవిస్తున్నాయి. ఇవి వినియోగదారులకు విరివిగా లోన్లు మంజూరు చేస్తూ డిజిటల్ లెండింగ్ ను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఫలితంగా ఈ బిజినెస్ వేగంగా వృద్ధి చెందుతోంది. అంతేకాక బ్యాంకింగ్ సంస్థలతో పోటీపడుతున్నాయి. ఎందుకంటే ఫిన్ టెక్ సంస్థలు పెద్దగా కొర్రీలు లేకుండా వినియోగదారులకు సులభంగా మంజూరు చేస్తున్నాయి. ఫలితంగా చాలా మంది బ్యాంకులకు బదులు ఈ యాప్ లను ఆశ్రయిస్తున్నారు. దీంతో నకిలీ బెడద కూడా అధికమైంది. చట్టబద్ధంగా ఏర్పడిన స్టార్టప్ లు పనితీరు బాగానే ఉంటున్నా.. నకిలీ యాప్ లతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
మన దేశంలో ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న సుమారు 1,100 రుణ యాప్ లలో దాదాపు 600లకు పైగా చట్టవిరుద్ధమైనవని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వర్కింగ్ కమిటీ గుర్తించింది. ఇటువంటి పరిస్థితుల్లో వినియోగదారులు ఈ యాప్ లలో లోన్లు తీసుకొనే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పలు విధాలుగా క్రాస్ చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. అవేంటో చూద్దాం రండి..
రుణదాత ప్రొఫైల్ చెక్ చేయండి.. రుణాన్ని పొందే ముందు రుణదాత విశ్వసనీయతను పరిశోధించడం ముఖ్యం. డిజిటల్ లెండింగ్ పరిశ్రమలో శ్రద్ధ కోసం చాలా మంది రుణదాతలు పోటీపడుతున్నందున, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) లేదా ఏదైనా ఇతర లోన్ ప్రొవైడర్ ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా నమోదు అయి ఉందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. బాగా ఫేమ్ ఉన్న వెబ్ సైట్లలోనే లోన్లు తీసుకోవాలి. అలా తీసుకొనే ముందు యాప్ కింద రివ్యూలు చూడటం మంచిది.
రుణ నిబంధనలు, షరతులను తనిఖీ చేయండి.. డిజిటల్ లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు, లోన్ ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు, షరతులను అధ్యయనం చేయడం అర్థం చేసుకోవడం చాలా కీలకం. ఇందులో వడ్డీ రేట్లు, చెల్లింపు టైమ్‌టేబుల్‌లు, ఫీజులు, ఏవైనా ఇతర బాధ్యతలను అర్థం చేసుకోవాలి. ఆలస్యంగా లేదా ముందస్తుగా చెల్లింపులు చేసినందుకు ఏదైనా హెడెన్ చార్జీలు లేదా జరిమానాలు ఉన్నాయేమో తనిఖీ చేసుకోవడం ముఖ్యం. వడ్డీ రేట్లు, ప్రీపేమెంట్ పెనాల్టీలు, ప్రాసెసింగ్ ఫీజులు, లోన్ వ్యవధి, రీపేమెంట్ ఎంపికలు అన్నీ జాగ్రత్తగా అధ్యయనం చేయాలి.
ప్రైవసీ విషయాలను మర్చిపోవద్దు.. రుణదాత మీ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తారో, భద్రపరుస్తారో వివరించే గోప్యతా విధానాన్ని కలిగి ఉన్నారో లేదో తనిఖీ చేయండి. లోన్ యాప్ అధికంగా మీ అనుమతులను అభ్యర్థిస్తుంది అంటే కాస్త ఆలోచించాలి. ఆ యాప్ నకు అన్ని పర్మిషన్లు ఇవ్వొద్దు. అవసరం మేరకు మాత్రమే పర్మిషన్లు ఇవ్వాలి. లేకుంటే డేటాను ఆయాప్ వారు చట్టవిరుద్ధంగా వినియోగించే అవకాశం ఉంటుంది. మీ గోప్యతను రక్షించడానికి, మీ ఫోన్‌లోని మీ పరిచయాలు, స్థానం, ఫోటోగ్రాఫ్‌లకు అనవసరమైన యాక్సెస్‌ను యాప్ నకు ఇవ్వొద్దు. మీ వ్యక్తిగత, ఆర్థిక డేటాను భద్రపరచడానికి ఉపయోగించే ఎన్‌క్రిప్షన్ టెక్నిక్‌లను తనిఖీ చేయండి. రుణదాత డేటా రక్షణ మరియు గోప్యతా నిబంధనలను అనుసరిస్తున్నట్లు నిర్ధారించుకోండి.
బహుళ రుణ యాప్‌లు వద్దు.. డిజిటల్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి క్రెడిట్ చెక్ అవసరమవుతుందని అర్థం చేసుకోండి, అది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపవచ్చు. ప్రతి క్రెడిట్ చెక్ మీ క్రెడిట్ రికార్డును ప్రభావితం చేస్తుంది. తక్కువ వ్యవధిలో అనేక రుణాల కోసం దరఖాస్తు చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. మీ క్రెడిట్ స్కోర్ ని బట్టి మీకు ఆమోదం లభించే అవకాశం ఉన్న రుణాల కోసం మాత్రమే దరఖాస్తు చేయాలి.
COMMENTS