LIC Aadhaar Shila Plan: 11 lakh returns with an investment of Rs.87 per day... This is the new scheme of LIC for women...
LIC Aadhaar Shila Plan: రోజుకు రూ.87 పెట్టుబడితో రూ.11 లక్షల రాబడి… మహిళల కోసం ఎల్‌ఐసీ కొత్త పథకం ఇదే…
భారతదేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఉన్న ఆదరణ వేరు. ఎల్‌ఐసీలో పాలసీ తీసుకుంటే పెట్టుబడికి భరోసాతో పాటు కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ ఉండడంతో ఎక్కువ మంది ఎల్‌ఐసీ కట్టడానికి ఇష్టపడుతున్నారు. భారతదేశంలో ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చినా ఎల్‌ఐసీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఎల్‌ఐసీ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఎల్‌ఐసీ మహిళల కోసం సరికొత్త పాలసీని స్టార్ట్ చేసింది. ఎల్‌ఐసీ ఆధార్ శిలా ప్లాన్ అని పేరుతో లాంచ్ చేసిన ఈ ప్లాన్ నాన్-లింక్డ్, వ్యక్తిగత జీవిత బీమా పథకం.
ఈ ప్లాన్ జాయిన్ కావాలంటే ఏ పత్రాలు కావాలి? ఈ ప్లాన్ వల్ల మహిళలకు కలిగే లాభాలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.
ఎల్‌ఐసీ ఆధార్ శిలా ప్లాన్ కింద మెచ్యూరిటీ తర్వాత స్థిర చెల్లింపు అందిస్తారు. అలాగే పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే కుటుంబానికి పాలసీ మొత్తాన్ని అందిస్తారు. అయితే ఆధార్ కార్డును కలిగి ఉన్న మహిళలు మాత్రమే ఈ పాలసీని పొందేందుకు అర్హులు. ఈ పథకంలో చేరే మహిళలు 55 ఏళ్ల లోపు ఉండాలి. మెచ్యూరిటీ సమయంలో గరిష్ట వయస్సు 70 సంవత్సరాలుగా ఉంటుంది. అయితే పాలసీ వ్యవధి 10 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. ఉదాహరణకు ఒక మహిళకు 55 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు 15 ఏళ్ల వ్యవధికి పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీలో హామీ మొత్తం రూ. 2 లక్షల నుంచి గరిష్టంగా రూ. 5 లక్షల వరకు ఉంటుంది. ఎల్‌ఐసీ ఆధార్ శిలా పాలసీ ద్వారా మెచ్యూరిటీ తర్వాత రూ. 11 లక్షలు సేకరించేందుకు రోజుకు రూ.87 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే వార్షికంగా రూ. 31,755 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 10 సంవత్సరాలకు డిపాజిట్ మొత్తం డిపాజిట్ మొత్తం రూ. 3,17,550 అవుతుంది. 70 ఏళ్ల వయస్సు వచ్చాక మెచ్యూరిటీ సొమ్ము రూ.11 లక్షలు వస్తాయి.
ఈ పాలసీపై అదనపు సమాచారం కోసం స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఈ పాలసీ మరొక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే మెచ్యూరిటీ తర్వాత పాలసీదారు వార్షిక వాయిదాల్లో మెచ్యూరిటీ మొత్తాన్ని స్వీకరించడాన్ని ఎంచుకోవచ్చు. పాలసీదారు మరణించిన సందర్భంలో హామీ మొత్తం నామినీకి అందిస్తారు. ఈ మొత్తం వార్షిక ప్రీమియం కంటే 7 రెట్లు లేదా హామీ మొత్తంలో 110 శాతం వరకు ఉంటుంది. ఈ ఎల్‌ఐసీ ప్రోగ్రామ్ మహిళలకు జీవిత బీమా ప్రయోజనాల ప్రయోజనాన్ని పొందుతూ వారి ఆర్థిక భవిష్యత్తును కాపాడుకోవడానికి ఆచరణాత్మక, సమర్థవంతమైన విధానాన్ని అందిస్తుంది. కుటుంబ ఆర్థిక శ్రేయస్సు కోసం పెట్టుబడి పెట్టడానికి, వారి భద్రతను అందించడానికి ఇది మంచి అవకాశం.
COMMENTS