India Post: Rs.10 Lakhs for just Rs.299.. Post Office Overwhelming Scheme..Join Now!
India Post: కేవలం రూ.299కే రూ.10 లక్షలు.. పోస్టాఫీసు అదిరిపోయే స్కీమ్.. ఇప్పుడే చేరండి!
India Post: మీరు ప్రమాద బీమా పాలసీ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకో అద్బుతమైన పాలసీ అందుబాటులో ఉంది. తక్కువ ప్రీమియంతోనే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ లభిస్తోంది. రూ. 299తోనే రూ.10 లక్షల వరకు బీమా లభిస్తుంది. ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి.
India Post: కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత ప్రజల్లో హెల్త్ ఇన్సూరెన్స్‌పై అవగాహన పెరిగింది. చాలా మంది ఆరోగ్య బీమా పాలసీలు తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు. వయసు ప్రతిపాదికన ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం మారుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది వీటికి దూరంగా ఉంటున్నారు. ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపిస్తోంది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. తన కస్టమర్ల కోసం స్పెషల్ గ్రూప్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కస్టమర్లు వార్షిక ప్రీమియం కేవలం రూ.299, రూ.399 తోనే ఏకంగా రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజ్ అందిస్తోంది.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB), టాటా ఏఐజీ భాగస్వామ్యంతో కస్టమర్లు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ తెచ్చారు. ఇందులో చేరేందుకు 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు అర్హులు. ప్రమాదవశాత్తు పాలసీదారుడు మరణించినా లేదా శాశ్వత అంగ వైకల్యం సంభవించినా రూ.10 లక్షలు చెల్లిస్తుంది పోస్టల్ బ్యాంక్. ఈ ఇన్సూరెన్స్ పాలసీని ప్రతి ఏటా రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకండా ఈ బెనిఫిట్ పొందాలని భావించే వారికి కచ్చితంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఖాతా అనేది ఉండాలి.
బెనిఫిట్స్ ఇవే..
పోస్టాఫీసు బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా, ఏదైనా అవయవం కోల్పోయినా పక్షవాతం వచ్చినా రూ. 10 లక్షలు ఇస్తారు.
పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా పరమాదం జరిగి వైద్యం కోసం ఆసుపత్రిలో చేరితే ఇన్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ కింద రూ. 60 వేలు లేదా క్లెయిమ్ చేసిన మొత్తంలో ఏది తక్కువైతే అది ఇస్తారు.
ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ విషయంలో రూ. 30 వేలు ఇస్తారు.
ప్రీమియం రూ.399 కడితే అదనపు బెనిఫిట్స్..
ఈ పాలసీలో విద్యా ప్రయోజనం కింద గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు ఫీజులో 10 శాతం లేదా లక్ష రూపాయల వరకు ఎంచుకోవచ్చు.
అలాగే ఆసుపత్రిలో చికిత్స సమయంలో రోజు వారీ నగదు రూలంలో రోజుకు వెయ్యి రూపాయన చొప్పున 10 రోజుల పాటు చెల్లిస్తారు. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి కుటుంబ ప్రయోజనం కింద రవాణా ఖర్చుల కోసం రూ. 25 వేలు లేదా అసలులో ఏది తక్కువైతే అది చెల్లిస్ాతరు. ఒక వేల పాలసీదారుడు మరణిస్తే అంత్యక్రియల కోసం రూ. 5 వేలు అందుతాయి.
COMMENTS