IBPS PO 2023 Notification PDF Out for 3049 Vacancies
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్/ మేనేజ్‌మెంట్ ట్రైనీ (సీఆర్‌పీ పీవో/ఎంటీ-XIII, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XIII) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది.
డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండుదశల రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 21 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రస్తుతానికి ఐబీపీఎస్ ఉద్యోగాలకు సంబంధించిన విండో నోటిఫికేషన్‌ను మాత్రమే విడుదల చేసింది. పూర్తిస్థాయి నోటిఫికేషన్లు దరఖాస్తు సమయం నుంచి అందుబాటులో ఉండనున్నాయి. పోస్టుల, అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం తదితర వివరాలన్నీ అందులో ఉంటాయి.
వివరాలు..
1) ప్రొబేషనరీ ఆఫీసర్స్/ మేనేజ్‌మెంట్ ట్రైనీ
2) స్పెషలిస్ట్ ఆఫీసర్స్
అర్హత: ఏదైనా డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
పీవో/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.08.2023
➥ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 21.08.2023
➥ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: సెప్టెంబర్/ అక్టోబర్ 2023.
➥ మెయిన్ పరీక్ష: నవంబర్ 2023.
➥ ఇంటర్వ్యూ: జనవరి/ ఫిబ్రవరి 2024
స్పెషలిస్ట్ ఆఫీసర్లు
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.08.2023
➥ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 21.08.2023
➥ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: డిసెంబర్ 2023.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
COMMENTS