IAS Inspiring Story : Deaf in hearing, still got 9th rank in UPSC exam
IAS Inspiring Story : వినికిడి సామర్థ్యం కోల్పోయింది, అయినా UPSC పరీక్షలో 9వ ర్యాంక్ వచ్చింది
IAS Inspiring Story: మనం సాధారణ వ్యక్తులం. కొన్నిసార్లు మన జీవితాన్ని చాలా కష్టంగా భావిస్తాము. అయితే జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో దివ్యాంగులైన వారిని అడగండి. అసలైన కష్టాలంటే వారివే. ఈ కథ కూడా అలాంటి వ్యక్తికి సంబంధించినదే, ఆమెకు వినికిడి లోపం ఉంది. పట్టుదలతో సివిల్స్ సాధించింది. IAS అయ్యింది. ఆమె కథ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.
IAS Inspiring Story : ఈ కథ UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2017లో 9వ ర్యాంక్ సాధించిన సౌమ్య శర్మది. ఐఏఎస్ టాపర్ సౌమ్య విజయగాథ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుంది. ఎందుకంటే ఆమెకు వినికిడి లోపం ఉంది. అయినప్పటికీ ఆమె 23 సంవత్సరాల వయస్సులోనే సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి IAS పదవిని పొందింది. ఆమె స్వస్థలం ఢిల్లీ.
సౌమ్య తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లు. ఆమె తన పాఠశాల విద్యను ఢిల్లీలో పూర్తి చేసింది. తర్వాత న్యూ ఢిల్లీలోని నేషనల్ లా స్కూల్ నుంచి డిగ్రీ చేసింది. సౌమ్య 11వ తరగతి చదువుతున్నప్పుడు ఆమెకు వినికిడి శక్తి తగ్గడం మొదలైంది. అప్పటి నుంచి, ఆమె వినడానికి.. వినికిడి పరికరాలపై ఆధారపడటం ప్రారంభించింది.
సౌమ్య తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లు. ఆమె తన పాఠశాల విద్యను ఢిల్లీలో పూర్తి చేసింది. తర్వాత న్యూ ఢిల్లీలోని నేషనల్ లా స్కూల్ నుంచి డిగ్రీ చేసింది. సౌమ్య 11వ తరగతి చదువుతున్నప్పుడు ఆమెకు వినికిడి శక్తి తగ్గడం మొదలైంది. అప్పటి నుంచి, ఆమె వినడానికి.. వినికిడి పరికరాలపై ఆధారపడటం ప్రారంభించింది.
వినికిడి లోపం ఉన్న అభ్యర్థులను... ఫిజికల్లీ ఛాలెంజ్డ్ (దివ్యాంగ) అభ్యర్థుల కేటగిరీలో చేర్చాలని సౌమ్య హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఆమె హైకోర్టుకు లేఖ రాయడం అప్పట్లో సెన్సేషన్ అయ్యింది.
ఆ సమయంలో.. ఆర్థోపెడికల్, దృష్టి వికలాంగులకు మాత్రమే కోటా ఉండేది. ఆమె లేఖను పరిగణనలోకి తీసుకున్న అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి రోహిణి ఎలాంటి విచారణా లేకుండానే రిజర్వేషన్లను పొడిగించారు.
సౌమ్య తన స్టడీ షెడ్యూల్‌ను మీడియాతో పంచుకుంది. ఆమె రోజూ 5-6 గంటలు మాత్రమే చదువుకునేది. ఆమె ఇంటర్నెట్‌పై ఎక్కువగా ఆధారపడేది. రోజువారీ కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఇచ్చింది.
CSATని తేలికగా తీసుకోవద్దనీ, CSAT పేపర్లను బాగా ప్రాక్టీస్ చేయాలని ఆమె అభ్యర్థులకు సూచించింది. రోజూ వార్తాపత్రికలు చదవాలని తెలిపింది. సౌమ్య లా తన ఆప్షనల్ సబ్జెక్ట్‌గా తీసుకుంది. గ్రాడ్యుయేషన్‌లో కూడా ఇది చదివింది. సౌమ్య ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బయోలో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఆమె ప్రస్తుతం జిల్లా పరిషత్ నాగ్‌పూర్ సీఈఓ. ఆమె 2018 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. కేడర్‌కు చెందినవారు.
COMMENTS