Home Loan: Want to take a home loan? Try these banks..
Home Loan: హోం లోన్ తీసుకోవాలనుకొంటున్నారా? ఈ బ్యాంకుల్లో ట్రై చేయండి.. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు మరిన్ని సౌకర్యాలు..
సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుడి వరకూ చిరకాల కల సొంతింటిని కలిగి ఉండటం. దీనిని నెరవేర్చుకోడానికి జీవితాంతం కష్టపడుతుంటారు. అందుకు ఉపకరించేది గృహ రుణం. పెద్ద మొత్తంలో లోన్ తీసుకొని, సులభవాయిదాలలో చెల్లించే వెసులుబాటు దీనిలో ఉంటుంది. అయితే ఇది అందరికీ ఒకే రకమైన వడ్డీ రేట్లు అందించదు. వ్యక్తుల వయసు, విద్యార్హతలు, వారి ఆదాయం, వారిపై ఆధారపడిన వారు, భార్య లేదా భర్త ఆదాయం, మీరు పనిచేసే చోట స్టెబిలిటీ, కొనసాగే విధానం, మీరు చేసే ఉద్యోగం, మీకున్న ఆస్తులు, ఆ ఆస్తుల మార్కెట్ విలువ వంటి వాటి ఆధారంగా మీకు బ్యాంకర్లు హోమ్ లోన్ మంజూరు చేస్తారు. దీని వడ్డీ రేటు కూడా బ్యాంకులను బట్టి మారుతుంటుంది. ఆర్బీఐ సూచనల ప్రకారం మీ ఆర్థిక స్థిరత్వాన్ని కూడా బ్యాంకర్లు పరిగణనలోకి తసీుకుంటున్నాయి. ముఖ్యంగా సిబిల్ స్కోర్ ని కూడా పరిశీలస్తాయి.
అతి తక్కువ వడ్డీని అందించే బ్యాంకులను ఇప్పుడు చూద్దాం. అది కూడా 2023 ఆగస్టు నాటికి ఉన్న వడ్డీ రేట్లను పరిశీలిద్దాం..
హెచ్ డీ ఎఫ్సీ బ్యాంక్ 8.5శాతం నుంచి 9.4శాతం వరకూ హోమ్ లోన్లపై వడ్డీని వసూలు చేస్తుంది.
ఇండియన్ బ్యాంకులో 8.5 శాతం నుంచి 9.9వరకూ వడ్డీ రేటు ఉంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు హోమ్ లోన్లపై 8.5శాతం నుంచి 10.1శాతం వరకూ వడ్డీని వసూలు చేస్తుంది.
ఇండస్ ఇండ్ బ్యాంకులో 8.5శాతం నుంచి 10.55శాతం వరకూ వడ్డీ రేటు ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8.5శాతం నుంచి 10.6శాతం వరకూ హోమ్ లోన్లపై వడ్డీ రేటు ఉంటుంది.
ఐడీబీఐ బ్యాంక్ 8.55శాతం నుంచి 10.75శాతం వరకూ వడ్డీతో లోన్లు అందిస్తాయి.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 8.6శాతం నుంచి 10.3శాతం వరకూ వడ్డీ రేట్లు విధిస్తున్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో హోమ్ లోన్లపై 8.6శాతం నుంచి 10.3శాతం వరకూ వడ్డీని అందిస్తాయి.
ఎస్బీఐ టెర్మ్ లోన్ 8.7శాతం నుంచి 9.65శాతం వరకూ హోమ్ లోన్లపై వడ్డీ రేటు విధిస్తారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8.7శాతం నుంచి 10.9శాతం వరకూ వడ్డీ రేటు ఉంటుంది.
ఈఎంఐలు ఇలా ఉంటాయి..
మీరు తీసుకున్న హోమ్ లోన్లను తిరిగి సులభవాయిదాలలో ఈఎంఐలుగా చెల్లించే వీలుంటుంది. ప్రతి నెల కొంత వడ్డీతోపాటు కొంత ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఈఎంఐలో మనం చెల్లిస్తూ ఉంటాం. మీరు లోన్ తీసుకున్న తర్వాతి నెల నుంచి ఈఎంఐ మొదలవుతుంది.
ఫ్లోటింగ్ రేట్..
ఇటీవల కాలంలో ఆర్బీఐ సూచనల ప్రకారం అన్ని బ్యాంకులు ఫ్లోటింగ్ రేట్ ను అమలు చేస్తున్నాయి. ఈఎంఐ కూడా మార్కెట్ హెచ్చుతగ్గుల ఆధారంగా మారుతుంటుంది. అది తగ్గినా, పెరిగినా అదే స్థాయిలో ఈఎంఐ కూడా మారుతుంటుంది. ఇది ఆర్బీఐ రెపో రేటు ఆధారంగా జరుగుతుంది.
లోన్ చార్జీలు..
హోమ్ లోన్లపై బ్యాంకులు ఒకేసారి చార్జీలను తీసుకుంటాయి. ఇది లోన్ మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఇది లోన్ తీసుకొనే వారు ప్రత్యేకంగా చెల్లించాల్సి ఉంటుంది. లోన్ మొత్తం నుంచి ఇది డిడక్డ్ అవ్వదు. అయితే కొన్ని బ్యాంకులు ఈ ప్రాసెసింగ్ ఫీజును కూడా మినహాయిస్తాయి. దీంతో పాటు కొన్ని బ్యాంకులు కొన్ని ప్రత్యేకమైన రుసుములు కూడా వసూలు చేసే అవకాశం ఉంటుంది.
COMMENTS