Govt Schemes : This is the government scheme that gives Rs.10 lakhs to students.. How to apply..?
Govt Schemes : విద్యార్థులకు రూ.10 లక్షలు ఇచ్చే గవర్నమెంట్ స్కీమ్ ఇదే.. ఎలా అప్లయ్ చేసుకోవాలంటే..?
Government Scheme for Students : కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం చాలా మందికి తెలియదు. కొన్ని మాత్రమే జనబాహుళ్యంలో ప్రచారంలో ఉంటాయి. ఈ క్రమంలో విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న SSPCA స్కీమ్ గురించి తెలుసుకుందాం..
Government Scheme for Students : విదేశాల్లో జరిగే పోటీల్లో పాల్గొనాలంటే సామాన్య విద్యార్థులకు చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్న పని. అయితే.. ఇంజినీరింగ్ విద్యార్థులు విదేశాలకు వెళ్లి అక్కడ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించే ఓ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.లక్ష చొప్పున ఒక బృందంలో అత్యధికంగా 10 మందికి ఇలాంటి సాయం అందజేస్తుంది. ఈ స్కీమ్ పేరే Support To Students For Participating In Competition Abroad పథకం.
విద్యార్థుల విమాన టికెట్ ఛార్జీలు, రైలు ప్రయాణ ఖర్చులు, వసతి, భోజనం ఖర్చులు, రిజిస్ట్రేషన్, వీసా ఫీజులకు ఈ అమౌంట్ వెచ్చించాల్సి ఉంటుంది. ఒకసారి పోటీకి వెళ్లి వచ్చాక ఖర్చుకు సంబంధించి లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది.
ఈ స్కీమ్ ఉద్దేశం ఏమిటంటే..?
దేశంలో B.E/B Tech లేదా ఇంటిగ్రేటెడ్ M. Tech, లేదా M.E./MTech ఫస్టియర్, సెకండియర్ చదువుతున్న విద్యార్థులు విదేశాల్లో జరిగే అంతర్జాతీయ కాంపిటీషన్లలో పాల్గొనడానికి వీలుగా ప్రవేశపెట్టిన పథకం ఇది. ఇంజినీరింగ్ విద్య నాణ్యతను పెంచడంతోపాటు విద్యార్థుల్లో పరిశోధన, ఆవిష్కరణలు, పోటీతత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది.
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE) ఈ పథకాన్ని అమలు చేస్తోంది. విద్యార్థులకు అంతర్జాతీయ సైన్స్ కాంపిటీషన్లలో పోటీలకు సంబంధించి ఆహ్వానం ఉన్నట్లయితే.. అవి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీలుగా గుర్తింపు పొందినవి అయితే.. అలాంటి పోటీల్లో విద్యార్థులు పాల్గొనడానికి కేంద్ర ప్రభుత్వం, AICTE ఆర్థిక సహాయం అందజేస్తాయి.
ఎవరు అర్హులంటే..?
ఇంజినీరింగ్ విద్యార్థులందరూ అర్హులే. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE) గుర్తింపు పొందిన ఇంజినీరింగ్ కాలేజీల్లో B.E/B Tech లేదా ఇంటిగ్రేటెడ్ M. Tech, లేదా M.E./MTech ఫస్టియర్, సెకండియర్ చదువుతున్న చదువుతున్న విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులే. అయితే.. పోటీలకు వెళ్లే విద్యార్థుల బృందంలో కనీసం ఇద్దరికి తగ్గకుండా 10 మందికి మించకుండా ఉండాలి.
దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..?
- విద్యార్థులు మొదట ఈ వెబ్ లింకు ద్వారా AICTE వెబ్‌సైటులోకి వెళ్లి అక్కడ విద్యార్థులకు అందిస్తున్న పథకాల విండోకి వెళ్లాలి.
- అందులో 'Support to Students for Participating in Competition Abroad Scheme అనే దాన్ని క్లిక్ చేసి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ఈ దరఖాస్తును పూర్తి చేసి అందులో అవసరమైన చోటల్లా మీరు చదువుతున్న కాలేజీ లేదా విద్యా సంస్థ లేదా యూనివర్సిటీ అథారిటీ సంతకాలు, స్టాంపు, మీ సంతకాలు ఉండేలా చూసుకోవాలి.
- మీరు పోటీలో పాల్గొనాలని మీకు లేదా మీ బృందానికి అందిన అంతర్జాతీయ కాంపిటీషన్ ఇన్విటేషన్ పత్రం కాపీ జత చేయాలి.
- ఇందులో మీరు పొందుపరిచే ప్రతి సమాచారం కూడా చాలా కచ్చితమైనదై ఉండాలి.
- అలాగే.. ఆ పోటీలో మీరు ఇవ్వనున్న ప్రజెంటేషన్, ఆ పోటీకి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ప్రత్యేక డాక్యుమెంట్ సమర్పించాలి.
COMMENTS