Gas Agency Dealership: Huge income with gas agency.. Set yourself up.. How to get license.. Full details..
Gas Agency Dealership: గ్యాస్ ఏజెన్సీతో భారీ ఆదాయం.. మీరే ఏర్పాటు చేసుకోండి.. లైసెన్స్ ఎలా పొందాలి.. పూర్తి వివరాలివే..
Gas Dealership: ఈ రోజుల్లో చాలా మంది మనసు బిజినెస్‌వైపు మళ్లుతుంది. ఆదాయం సరిపోకనో.. కొత్తగా ఏదైనా చేయాలనో.. ఉద్యోగం ఇష్టం లేకనో ఏదైనా కావొచ్చు. అయితే ప్రస్తుతం గ్యాస్ ఏజెన్సీ ఏర్పాటు చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దీంట్లో పెద్దగా రిస్క్ లేదు. మరి దీనికి ఏమేం అర్హతలు కావాలి.. ఏం చేయాలి.. లైసెన్స్ ఎలా పొందాలి చూద్దాం.
LPG Gas Agency: ప్రస్తుత రోజుల్లో సంపాదనలో పెద్ద మొత్తంలో ఖర్చులకే పోతుంది. ఎక్కువగా మిగలట్లేదు. ఈ క్రమంలోనే చాలా మంది ఒకటికి మించి ఆదాయ వనరులను ఎంచుకుంటున్నారు. ఇక ఎక్కువ రిస్క్ లేకుండా.. సింపుల్‌గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వారికి LPG గ్యాస్ ఏజెన్సీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దీనికి డిమాండ్ ఏడాది మొత్తం ఉంటుంది కూడా. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం దాదాపు అందరి ఇళ్లలో LPG గ్యాస్ కనెక్షన్ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) ఉంటుంది. రోజూ వంట చేయాలంటే గ్యాస్ తప్పనిసరి. అందుకే ఎల్‌పీజీ గ్యాస్‌కు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుందని చెప్పొచ్చు. ఫలితంగా ఈ గ్యాస్ ఏజెన్సీ మెయింటెయిన్ చేస్తే లాభాలు భారీగానే వస్తాయి. బిజినెస్ ప్రారంభంలో ఇన్వెస్ట్‌మెంట్ కాస్త ఎక్కువగా అనిపించినప్పటికీ బ్యాంకుల ద్వారా సులభంగా లోన్లు పొందొచ్చు. ఇక్కడ బిజినెస్‌లోకి అడుగుపెడుతుంటే అన్నీ ముందే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అన్నింటికీ సిద్ధపడితేనే ఇందులోకి ప్రవేశించడం మంచిది.
4 రకాల డిస్ట్రిబ్యూటర్స్..
LPG గ్యాస్ ఏజెన్సీ ఏర్పాటు చేస్తే గనుక ప్రారంభ దశలోనే డిస్ట్రిబ్యూటర్ షిప్ ఎంపిక చేసుకోవాలి. దీని కోసం అర్బన్, రూర్బన్, రూరల్, హార్డ్ టు రీజినల్ అనే నాలుగు డిస్ట్రిబ్యూటర్స్‌లో ఒకదానిని ఎంపిక చేసుకోవాలి. దరఖాస్తు చేసేందుకు ముందు.. ఏజెన్సీ ఏర్పాటు కోసం కచ్చితమైన లొకేషన్ నిర్ధరించుకోవాలి. లొకేషన్ కోసం సర్వే కూడా చేయించుకోవాలి. ఏ ప్రాంతం అనుకూలంగా ఉంటుందో తెలుసుకొని.. అక్కడ ఏజెన్సీ ఏర్పాటు చేయాలి.
అర్హతలు ఏంటి?
LPG గ్యాస్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలనుకుంటే కొన్ని అర్హతలు ఉండాలి. దరఖాస్తుదారుని వయసు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన ఏదైనా బోర్డు నుంచి కనీసం 10వ తరగతి పాసై ఉండాలి. ఇక దరఖాస్తుదారుని కుటుంబంలోని ఏ ఒక్క సభ్యుడు కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ అంటే IOCL, HPCL వంటి వాటిల్లో ఉద్యోగం చేస్తూ ఉండకూడదు.
ఎంత కట్టాలి..
ఇక గ్యాస్ ఏజెన్సీ డీలర్‌షిప్ కోసం.. అప్లికేషన్ సమయంలో రూ. 10 వేలు కట్టాల్సి ఉంటుంది. ఇది నాన్ రీఫండబుల్. అంటే మళ్లీ ఉపసంహరించుకుంటే ఆ మొత్తం వెనక్కి రాదు. అదనంగా రూ. 15 లక్షల వరకు రిజర్వ్ ఫండ్ కచ్చితంగా ఉండాలి. గ్యాస్ సిలిండర్ల స్టోరేజీ సౌకర్యాలు, ఏజెన్సీ కార్యాలయాల ఏర్పాటు కోసం ఈ నిధులు వినియోగిస్తారు.
డిస్ట్రిబ్యూటర్ షిప్ అందించే కంపెనీలివే..
ఇండియన్ గవర్న్‌మెంట్ ఆధ్వర్యంలో పనిచేసే భారత్ గ్యాస్, HP గ్యాస్, ఇండేన్ గ్యాస్ వంటి కంపెనీలు డిస్ట్రిబ్యూటర్‌షిప్ ఆఫర్ చేస్తున్నాయి. ఎక్కువగా ఈ కంపెనీలు దినపత్రికలు, వివిధ మీడియా ఛానెళ్ల ద్వారా గ్యాస్ ఏజెన్సీ ప్రకటనలు జారీ చేస్తుంటాయి. అధికారిక నోటిఫికేషన్ ఇష్యూ చేసిన సమయంలో అర్హత గల అభ్యర్థులు, ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవచ్చు.
లైసెన్స్ ఎలా పొందాలి?
తొలుత LPG అధికారిక వెబ్‌సైట్ https://www.lpgvitarakchayan.in/ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మీ పర్సనల్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. కంపెనీలు దరఖాస్తుదారుడిని ఇంటర్వ్యూ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత దరఖాస్తుదారు అందించిన వివరాల్ని ధ్రువీకరిస్తాయి. అంతా సరిగానే ఉంటే.. కంపెనీ వారికి ఒక లెటర్ జారీ చేస్తుంది. చివరికి అభ్యర్థి.. డిస్ట్రిబ్యూటర్‌షిప్ కోసం ఎంపిక చేసుకున్న కంపెనీకి సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. తర్వాత మీ పేరుతో గ్యాస్ ఏజెన్సీ రిజిస్టర్ చేస్తారు.
COMMENTS