FD Rates: Fixed Deposit? 7 banks are giving more than 9 percent interest..!
FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? 9 శాతం పైగా వడ్డీ ఇస్తోన్న 7 బ్యాంకులివే..!
FD Rates: మీరు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? మీ డబ్బులకు ఎక్కువ రాబడి కావాలనుకుంటున్నట్లయితే మీకో మంచి అవకాశం ఉంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ వంటి పెద్ద బ్యాంకుల కన్నా ఈ 7 బ్యాంకులు అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఏకంగా వారికి 9 శాతంపైగా వడ్డీ కల్పిస్తున్నాయి. ఆయా బ్యాంకుల జాబితా, వడ్డీ రేట్ల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
FD Rates: ప్రస్తుత రోజుల్లో బ్యాంకులు డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు కల్పిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం కూడా ఉంది. ఇప్పుడే డిపాజిట్ చేసినట్లయితే మీకు అధిక రాబడి అందుకునే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు.. ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి పెద్ద పెద్ద బ్యాంకుల్లో స్పెషల్ స్కీమ్స్‌లో గరిష్ఠ వడ్డీ రేట్లు 9 శాతం కన్నా తక్కువగానే ఉన్నాయి. పెద్ద బ్యాంకుల్లోనే ఈ స్థాయిలో వడ్డీ రేట్లు లేవంటే ఇక ఏ బ్యాంకులు ఇవ్వవని అనుకుంటే పొరబడినట్లే. రిస్క్ లేకుండా అధిక రాబడి పొందేందుకు ఇప్పుడు మీకో అవకాశం ఉంది.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు బ్యాంకులు తమ బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వారికి భారీ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఈ 7 బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా 9 శాతానికిపైగా వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. స్పెషల్ టెన్యూర్లపై ఈ స్పెషల్ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. చిన్న బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే రిస్క్ ఉంటుందని మీరు ఆలోచిస్తున్నారామే. అలాంటి చింతే అవసరం ఉండదు. డిపాజిటర్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం ఉంటుంది. అందువల్ల మీరు ఈ 7 బ్యాంకుల్లో రూ. 5 లక్షలోపు చేసే డిపాజిట్లకు పూర్తి భద్రత ఉంటుంది. ఇప్పుడే ఆయా బ్యాంకుల్లో వడ్డీ రేట్లు, టెన్యూర్ల గురించి తెలుసుకుని డిపాజిట్ చేయండి.
ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు..
ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో సీనియర్ సిటిజన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9 శాతం వడ్డీ రేట్లు అందిస్తోంది. 444 రోజుల టెన్యూర్ పై ఈ వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేట్లు ఇవాళ్టి నుంచే అంటే ఆగస్టు 21, 2023 నుంచే అమలులోకి వచ్చాయి.
ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..
ఈఏఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో సీనియర్ సిటిజన్లు 2 ఏళ్ల నుంచి మూడేళ్లలోపు టెన్యూర్ కలిగిన డిపాజిట్లు చేసినట్లయితే వారికి 9 శాతం వడ్డీ రేట్లు లభిస్తాయి. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఈ వడ్డీ రేట్లు ఏప్రిల్ 14, 2023 నుంచి అమలులోకి వచ్చాయి.
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 750 రోజుల మెచ్యూరిటీ పీరియడ్ కలిగిన డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 9.11 శాతం వడ్డీ రేట్లు లభిస్తాయి. ఈ వడ్డీ రేట్లు జులై 26, 2023 నుంచే అమలులోకి వచ్చాయి.
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు..
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9 శాతం వడ్డీ రేట్లు అందిస్తోంది. ఈ గరిష్ఠ వడ్డీ రేటు 1095 రోజుల టెన్యూర్లకు వర్తిస్తుంది. ఈ సవరించిన వడ్డీ రేట్లు ఆగస్టు 15, 2023 నుంచే అమలులోకి వచ్చాయి.
సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 9.10 శాతం వడ్డీ రేట్లు లభిస్తున్నాయి. ఇది 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల మధ్య ఉన్న టెన్యూర్లపై వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఈ రేట్లు ఆగస్టు 7, 2023 నుంచే అమలులోకి వచ్చాయి. 15 నెలల నుంచి 2 ఏళ్లలోపు ఉంటే 9 శాతం, 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల మధ్య ఉంటే 9.10 శాతం వడ్డీ లభిస్తుంది.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 9.50 శాతం మేర వడ్డీ రేట్లు కల్పిస్తోంది. సవరించిన వడ్డీ రేట్లు ఆగస్ట్ 11, 2023 నుంచే అమలులోకి వచ్చాయి. అందులో ఆరు నెలల నుంచి 201 రోజుల టెన్యూర్లపై 9.25 శాతం, 501 రోజులకు 9.25 శాతం, 1001 రోజుల టెన్యూర్ పై 9.50 శాతం వడ్డీ కల్పిస్తోంది.
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాస్ బ్యాంక్
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 555 రోజుల టెన్యూర్ల, 1111 రోజుల టెన్యూర్లపై గరిష్ఠంగా 9.25 శాతం వడ్డీ రేట్లు కల్పిస్తోంది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఈ వడ్డీ రేట్లు జూన్ 6, 2023 నుంచి అమలులోకి వచ్చాయి.
COMMENTS