Digital Voter ID: Available digital voter card.. Download it on your phone..
Digital Voter ID: అందుబాటులో డిజిటల్ ఓటర్ కార్డు.. మీ ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోండిలా..
భారతదేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ గుర్తింపు కార్డులను ఇస్తుంది. ఒక గుర్తింపు కార్డులా ఓటింగ్ కేంద్రంలోనే కాకుండా చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. అయితే ప్రతిసారి దానిని మనం వెంట తీసుకెళ్లలేము. ఒక్కోసారి ఇంట్లోనే మరిచి వెళ్లినప్పుడు అవసరమైతే పని ఆగిపోయే పరిస్థితులు కూడా తలెత్తుతాయి. ఇకపై ఆ సమస్య ఎదురవకుండా మీ స్మార్ట్‌ఫోన్‌లోనే ఈ డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం రెండేళ్ల క్రితమే డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే ఫీచర్ తీసుకొచ్చింది. అంటే ఆధార్, పాన్ కార్డు మాదిరిగా డిజిటల్ కాపీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో డిజిటల్ కాపీని ఉంచుకుని ఎప్పుడు అవసరం అయితే అప్పుడు సులభంగా వినియోగించుకోవచ్చు. ఎన్నికల సమయంలోనూ ఈ డిజటల్ కార్డును చూపించి ఓటు వేయచ్చు కూడా.
అయితే భారత్‌లో ప్రస్తుతం 9.8 కోట్ల మంది ఓటర్లకు ఇ-ఓటర్ ఐడీ కార్డు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉన్నా 1 శాతం మంది మాత్రమే దీనిని సద్వినియోగం చేసుకున్నారని పలు నివేదికలు తెలుపుతున్నాయి. ఇక మీ డిజిటల్ ఓటర్ కార్డును ఎడిట్ చేయలేని పీడీఎఫ్ ఫైల్ రూపంలో పొందవచ్చు. దీన్నే ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడీ కార్డ్‌గా పిలుస్తారు. కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారిక పోర్టల్ నుంచి దీనిని సులువుగా పొందవచ్చు. పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకున్న డిజిటల్ కార్డును ప్రింట్ తీసుకుని లామినేట్ సైతం చేయించుకుని వినియోగించుకోవచ్చు.
డిజిటల్ కార్డు డౌన్‌లోడ్ ఇలా..
1.మనలో చాలా మంది దగ్గర ఆధార్ కార్డు లాగానే, ఓటర్ ఐడీ కార్డు కూడా ఉంటుంది. కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు. అలాంటి వారు దాన్ని ఎలా పొందాలి అని ఆలోచిస్తూ ఉండొచ్చు. అది ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ప్రక్రియ ద్వారా మనం మొబైల్‌లోనే మన ఓటర్ ఐడీ కార్డును డిజిటల్ రూపంలో ఉంచుకోవచ్చు, లేదా ఆధార్ కార్డు లాగా లామినేషన్ చేయించుకోవచ్చు. అది ఎలాగో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం.
2.ముందుగా.. కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ (https://voters.eci.gov.in/login)లోకి వెళ్లాలి. అక్కడ మీ మొబైల్ నంబర్ ఇవ్వడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ.. మొబైల్ నంబర్ ఇచ్చాక, మీ మొబైల్‌కి OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే, పాస్‌వర్డ్ సెట్ చేసుకోమని చెబుతుంది. అది ఇవ్వగానే.. రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. తర్వాత మీరు మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ ఇచ్చి, కింద కనిపించే కాప్చా నంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వొచ్చు.
3.మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ ఇచ్చి, కింద కనిపించే కాప్చా నంబర్ ఎంటర్ చేశాక, request OTPపై క్లిక్ చెయ్యాలి. అప్పుడు OTP ఎంటర్ చేసి, verify & login పై క్లిక్ చెయ్యాలి.
4.ఇప్పుడు మీకు సైట్ ఇలా కనిపిస్తుంది. ఇందులో కుడివైపు కింద మూల ఉన్న E-EPIC Download పై క్లిక్ చెయ్యాలి.
5.ఇప్పుడు మీకు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు Enter EPIC_NO దగ్గర.. మీ ఓటర్ ఐడీ కార్డుకి సంబంధించిన ఎపిక్ నంబర్ ఇవ్వాలి. తర్వాత Select Stateలో మీ రాష్ట్రంని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత Search బాక్స్ క్లిక్ చెయ్యాలి.
6.ఇప్పుడు మీకు మీ ఐటర్ ఐడీకి సంబంధించిన వివరాలను చూపిస్తుంది. ఆ వివరాలు సరైనవే అని మీకు అనిపిస్తే, అప్పుడు మీరు కింద ఉన్న send OTP క్లిక్ చెయ్యాలి.
7.ఇప్పుడు మీ మొబైల్‌కి వచ్చే OTPని ఎంటర్ చేసి, verify బాక్స్ క్లిక్ చెయ్యాలి.
8.మీరు ఎంటర్ చేసిన OTP కరెక్ట్ అయితే, కరెక్ట్ అని చూపిస్తుంది. ఆ తర్వాత మీరు మీ డిజిటల్ ఓటర్ ఐడీ కార్డు కోసం… download e-EPIC క్లిక్ చెయ్యాలి.
9.అప్పుడు ఈ ఫొటోలో చూపిస్తున్నటువంటి డిజిటల్ ఓటర్ ఐడీ కార్డు మీ మొబైల్‌లో pdf ఫార్మాట్‌లో సేవ్ అవుతుంది. దాన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు, స్కాన్ చేయించుకొని, లేమినేషన్ చేయించుకోవడం ద్వారా.. ఆధార్ కార్డ్ తరహాలో చేయించుకోవచ్చు. లేదా మొబైల్‌లోనే సేవ్ చేసుకొని, అవసరమైనప్పుడు, ఎవరైనా అధికారులు చూపించమన్నప్పుడు చూపించవచ్చు.
COMMENTS