How did diamonds come to earth? How many years does it take to make a diamond?
వజ్రాలు భూమిపైకి ఎలా వచ్చాయి..? ఒక వజ్రం తయారవ్వడానికి ఎన్ని ఏళ్లు పడుతుంది..?
బంగారం కంటే విలువైనవి వజ్రాలు. ఒక్క చిన్న డైమండ్ ఖరీదై లక్షల్లో ఉంటుంది. బంగారం ఎలా తయారు చేస్తారో మనకు తెలుసు. కానీ వజ్రాలు తయారు చేసేవి కావు, వీటిని ఎవరో సృష్టించలేదు.. భూమిమీద ఏర్పడ్డ సంపద ఇది.. అందుకే అవి అంత ఖరీదు. అసలు వజ్రాలు ఎలా భూమీమీదకు వచ్చాయి..? అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా..మీరు వినే ఉంటారు.. ఆంధ్రాలోని కొన్ని ఏరియాల్లో పొలాల్లో వజ్రాలు దొరుకుతాయి అని. ఎలా అక్కడే ఎందుకు దొరుకుతాయి.. అసలు వజ్రాలకు భూమికి ఏంటి సంబంధం.. ఇలాంటి ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ మీకోసం.!
వజ్రాలు ఎంతో దృఢమైనవవి. వీటిని మీరు పెద్ద సుత్తితో పగలగొట్టాలని చూసినా అవి పగలవు. ఎందుకంటే ఇవి అపారమైన పీడనంతో పాటు ఒత్తిడి వల్ల తయారవుతాయి. అంతేకాకుండా ఇవి భూమి బరువు కూడా భరించగలవని నిపుణులు చెబుతున్నారు. ఒక రాయి అరుదైన వజ్రంలా తయారు కావడానికి కొన్ని వందల ఏళ్లు పడుతుందట. మొదటగా ఈ వజ్రాలు భూమిలోని 170 కిలోమీటర్ల లోపల ఏర్పడతాయి. ఆ తర్వాత అగ్ని పర్వాతాలు బద్ధలయ్యే క్రమంలో బయటికి వస్తాయని. దీనికి కూడా పెద్ద ప్రాసెస్ ఉంటుందని నిపుణులు అంటున్నారు.
వజ్రాలు భూమి మీదికి రావడానికి పెద్ద ప్రక్రియ ఉంటుంది. యూనివర్శిటీ ఆఫ్ సౌతాంప్టన్, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ అధ్యయనాల ప్రకారం.. బద్ధలైన అగ్ని పర్వాతాల నుంచి లావా లాగా బయటికి వస్తాయి. ఆ తర్వాత ఈ వజ్రాలు భూమి నుంచి ఆకాశానికి వెళ్లి అక్కడ ఒక సంవత్సరం పాటు ఉండి..ఇలా కాలక్రమేనా భూమి పై పొరలలోకి చేరుకుని భూమిపై పడతాయని అధ్యయనాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా అరుదైన వజ్రాలు తయారు కావడానికి మరింత ప్రాసెస్ ఉందట…
వజ్రం పూర్తిగా తయారు కావడానికి కొన్ని వందల కిలో మిటర్ల భూమి లోపల నుంచి బయటకి రావాల్సి ఉంటుంది. వజ్రాన్ని పైనకి నెట్టేందుకు సరైన శక్తి కావాలి. ఇవి పైకి రావడానికి సరైన శక్తితో పాటు వాతావరణం కూడా అనుకూలించాలి. అయితే ఇదే అంశంపై శాస్త్రవేత్తల బృందం కొన్ని సంవత్సరాల నుంచి పరిశోధలు జరుపుతున్నారు. వారు ఖంగాల చరిత్రను కదిలించారు. ఇందులో భాగంగా కొన్ని వందల ఏళ్ల క్రితం భూమిపై ఖండాలు వేరు వేరుగా చీలిపోయాయి. ఇదే క్రమంలో అగ్నిపర్వతాల్లో భారీ పేలుళ్లు సంభవించి వజ్రాలను పట్టుకుని ఉన్న కింబర్ లైట్స్ రాళ్లు భూమిపై పడ్డాయి. ఇక కాలక్రమేనా వ్రజాలు భూమిపై కనిపించడం మొదలయ్యాయని పరిశోధనలు చెబుతున్నారు. అందుకే వజ్రాలకు అంత ఖరీదైనవి.
COMMENTS