Whatsapp Update: Another crazy update on WhatsApp.. From now on you can send HD quality photos
Whatsapp Update: వాట్సాప్‌లో మరో క్రేజీ అప్‌డేట్.. ఇకనుంచి హెచ్‌డీ క్వాలిటీ ఫొటోలు పంపుకోవచ్చు.
ఈ రోజుల్లో ప్రతిఒక్కరి చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వాడకుండా ఎవరూ ఉండలేరు. చాలామంది ముఖ్యంగా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లను వినియోగిస్తుంటారు. అయితే ఇవ్వన్నీ కూడా తమ వినియోగదారుల కోసం ఎప్పుడెప్పుకు కొత్త కొత్త అప్‌డేట్లతో వస్తుంటాయి.
ఇప్పుడు తాజాగా వాట్సాప్ మరో కొత్త అప్‌డేట్‌తో వచ్చింది. సాధారణంగా వాట్సాప్‌లో ఎంతమంచి క్వాలిటీ ఇమేజ్ అయినా కూడా అవతలి వారికి పంపినంపుడు ఆ ఇమేజ్ క్వాలిటీ తగ్గిపోతుంది. హెచ్‌డీ క్వాలిటీ ఫొటోలు పంపించాలంటే మెయిల్ చేయడమో.. లేదా ఇతర మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చేది.
కొంతమంది వినియోగదారులు క్వాలిటీ చెడిపోకుండా ఉండేందుకు వాట్సాప్‌లోనే డాక్యుమెంట్ ఆప్షన్ ఎంచుకుని ఫొటోలు పంపుకుంటారు. అయితే ఇకనుంచి అలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ వాట్సాప్ యూజర్లందరికి ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు మెటా సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ తెలిపారు.
ఇకనుంచి వాట్సాప్‌లోనే హై క్వాలిటీ ఫోటోలు పంపుకోవచ్చు. ఇది వినియోగించడానికి ముందుగా చాట్ మెనూలో ఉన్న కెమెరా ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కావాల్సిన ఫోటోను సెలక్ట్ చేసుకున్న తర్వాత పైన హెచ్‌డీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అంది సెలక్ట్ చేసుకున్నట్లైతే ఫొటో మంచి క్వాలిటీతో ఇతరులకు పంపుకోవచ్చు.
ఒకవేళ హెచ్‌డీ అక్కర్లేదూ అనుకుంటే మామూలుగానే పంపించుకోవచ్చు. ఈ సదుపాయం ఇప్పటికే కొందమందికి అందుబాటులోకి రాగా.. త్వరలో మిగిలిన వారికీ కూడా అందుబాటులోకి రానుంది. ఒకవేళ మీరు వాట్సాప్ అప్‌డేట్ చేసుకోనట్లైతే ఓసారి గూగుల్ ప్లేస్టోర్/ యాపిల్ యాప్ స్టోర్‌కు వెళ్లి యాప్‌ను అప్‌డేట్ చేసుకోండి.
COMMENTS