Common Admission Test (CAT) 2023 Entrance Exam Complete Details
కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) 2023 ప్రవేశ పరీక్ష పూర్తి వివరాలు.
ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోర్సులు చేసేందుకు అవకాశం కల్పించే ప్రవేశ పరీక్షే కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్). తాజాగా క్యాట్-2023 నోటిఫికేషన్ వెలువడింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎం కళాశాలలే స్వయంగా ఈ ప్రవేశపరీక్ష నిర్వహిస్తాయి. ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే క్యాట్‌లో సాధించిన పర్సంటైల్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. క్యాట్ స్కోరు ఆధారంగా ఐఐఎంలే కాకుండా పేరున్న కళాశాలలు కూడా తమ కళాశాలల్లో సీట్లను భర్తీ చేస్తాయి.
ఈ ప్రవేశ పరీక్ష యొక్క పూర్తి వివరాలు :
టెస్ట్ : కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) – 2023
అర్హత: కనీసం 50% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45% మార్కులు ఉన్నా అర్హులే). డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 155 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్లు: జమ్ము, కాశీపూర్, కోజికోడ్, లఖ్‌నవూ, నాగ్‌పుర్, రాయ్‌పూర్, రాంచీ, రోహ్‌తక్, సంబల్‌పూర్, అహ్మదాబాద్, అమృత్‌సర్, బోధ్ గయా, కోల్‌కతా, ఇందౌర్, షిల్లాంగ్, సిర్మౌర్, తిరుచిరాపల్లి, ఉదయపూర్, బెంగళూరు, విశాఖపట్నం.
పరీక్ష విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. సెక్షన్-1 వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రెహెన్షన్, సెక్షన్-2 డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, సెక్షన్-3 క్వాంటిటేటీవ్ ఎబిలిటీ విభాగాల్లో ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఆయా సంస్థలు బృంద చర్చలు, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, ముఖాముఖి నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు: జనరల్ కి రూ.2400, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకి రూ.1200 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది: ఆగస్ట్ 02, 2023
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది: సెప్టెంబర్ 13, 2023
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీలు: 25-10-2023 నుంచి 26-11-2023 వరకు.
పరీక్ష తేదీ: 26-11-2023.
ఫలితాల ప్రకటన: 2024, జనవరి రెండో వారం.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR WEBSITE CLICKHERE
COMMENTS