BTech : While working.. you can join BTech course.. not part time course.
BTech : ఉద్యోగం చేస్తూనే.. బీటెక్ కోర్సులో చేరొచ్చు.. పార్ట్‌టైమ్ కోర్సు కాదు.. రెగ్యులర్ మోడ్‌లోనే ఉంటుంది.. పూర్తి వివరాలివే
B Tech Courses : బీటెక్ చదవాలన్నది చాలా మంది కల. అయితే ఆర్థిక, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగం చేయక తప్పనిసరి పరిస్థితి. అయితే AICTE కీలక నిర్ణయం తీసుకుంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగం చేస్తూనే.. బీటెక్ చదువుకునే అవకాశం కల్పిస్తోంది.
BTech : ఇంజినీరింగ్ చేయాలన్నది మీ కలా..? కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదా..? అయితే.. ఈ అవకాశం మీ కోసమే.. ఉద్యోగం చేసుకొంటూనే.. బీటెక్ (BTech) చేయొచ్చు. అటు ఉద్యోగాన్ని.. ఇటు బీటెక్ చదువును రెండింటిని ఒకేసారి పూర్తిచేయవచ్చు. పరిశ్రమల్లో పనిచేసే వృత్తి నిపుణులు బీటెక్ (BTech) లో చేరే అవకాశం కల్పిస్తూ అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఒక్కో బ్రాంచిలో 30 సీట్లుంటాయి. ఇది పార్ట్‌టైమ్ కోర్సు కాదు.. రెగ్యులర్ మోడ్‌లోనే నిర్వహిస్తారు. ఈ కోర్సుల నిర్వహణకు విద్యాసంస్థల నుంచి తాజాగా AICTE దరఖాస్తులు కోరుతోంది. AICTE అనుమతించిన కాలేజీలు, కోర్సుల్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ బీటెక్ కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. నిరంతర విద్యను ప్రోత్సహించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు AICTE వర్గాలు వెల్లడించాయి. ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్‌లో భాగంగా సంస్థలు, పరిశ్రమల్లో పనిచేస్తూనే బీటెక్ కోర్సుల్లో చేరి.. పట్టా పొందొచ్చు.
AICTE నిబంధనలివే:
ప్రభుత్వం నుంచి గుర్తింపు/అనుమతి పొంది నడుస్తున్న పరిశ్రమలు, సంస్థల్లోని వర్కింగ్ ప్రొఫెషనల్స్ మాత్రమే ఈ కోటాలో ప్రవేశాలు పొందవచ్చు.
అయితే.. ఈ కోర్సులో చేరాలంటే.. పనిచేస్తున్న సంస్థ యాజమాన్యం అనుమతి తప్పనిసరి.
ఒక్కో జిల్లాలో ఒకటి నుంచి 4 వరకు విద్యాసంస్థలకు ఇలాంటి కోర్సులను నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తారు.
సివిల్, మెకానికల్ వంటి కోర్ కోర్సులతో పాటు.. సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్ వంటి కోర్సులను స్పెషలైజేషన్లుగా ఎంచుకోవచ్చు.
COMMENTS