Bank Holidays: Banks are closed for 7 days in Telugu states. This is the list.
Bank Holidays: తెలుగు రాష్ట్రాల్లో 7 రోజులు బ్యాంకులు బంద్.. లిస్ట్ ఇదే.. పనుంటే ముందే చూసుకోండి!
Bank Holidays: సాధారణంగా కొత్త నెల వచ్చిందంటే కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తుంటాయి. ఇవాళ్టి నుంచి ఆగస్టు నెల మొదలైపోయింది. ఈ నెలలో ప్రధానంగా బ్యాంకు సెలవుల గురించి తెలుసుకోవాలి. ఈ ఆగస్టులో మొత్తం 14 రోజులు బ్యాంకులు మూతపడనుండగా.. తెలుగు రాష్ట్రాల్లో 7 రోజులు మూసి ఉంటాయి.
Bank Holidays: జులై నెల ముగిసి.. ఆగస్టు నెల వచ్చేసింది. క్యాలెండర్‌లో నెల మారిందంటే ఒకటో తేదీ నుంచే కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తుంటాయి. ప్రధానంగా సిలిండర్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు వంటి వాటిల్లో మార్పు కనిపిస్తుంది. అలాగే ముఖ్యమైన విషయాల్లో బ్యాంకులు సైతం ఒకటి ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే బ్యాంకు పని వేళల గురించి ముందే తెలుసుకోవాలి. ఏ రోజులు బ్యాంకు సెలవులు ఉన్నాయి అనేది తెలుసుకోవడం ద్వారా ఇబ్బందులు తప్పించుకోవచ్చు. ఇక ఆగస్టు నెలలో బ్యాంకులకు మొత్తం 14 రోజులు సెలవులు ఉన్నాయి. ఇందులోనే రెండో, నాలుగో శనివారం, ఆదివారాలు కలిపి ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో 7 రోజులు బంద్..
ఆగస్టులో బ్యాంకులో ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు ఉన్న వారు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆగస్టు నెలలో బ్యాంకులకు 7 సెలవులు ఉన్నాయి. ఈ సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని మీ ట్రాన్సాక్షన్లు ప్లాన్ చేసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ అధికారిక వెబ్‌సైట్‌లో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ అప్డేట్ చేసింది. అందులోని వివరాల ప్రకారం బ్యాంకులకు సాధారణ సెలవులతో పాటు జాతీయ పండగలు, ప్రాంతీయ పండగలకు సెలవులు ఉంటాయి. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలవులు వివరాలు ఇలా ఉన్నాయి..
ఆగస్టు 6వ తేదీన ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు
ఆగస్టు 12వ తేదీన రెండో శనివారం సాధారణ సెలవు
ఆగస్టు 13వ తేదీన ఆదివారం
ఆగస్టు 15న మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 20న ఆదివారం
ఆగస్టు 26వ తేదీన నాలుగో శనివారం
ఆగస్టు 27వ తేదీన ఆదివారం
ఇది హైదరాబాద్ సర్కిల్‌లో సెలవుల జాబితా. ఆగస్టులో ఓ లాంగ్ వీకెండ్ కూడా వచ్చింది. ఆగస్టు 12 రెండో శనివారం కాగా, ఆగస్టు 13 ఆదివారం, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం ఉంది. మధ్యలో ఆగస్టు 14న సెలవు తీసుకుంటే వరుసగా నాలుగు రోజుల సెలవులు వస్తాయి. మరోవైపు.. ఆగస్టులో ఇతర సర్కిళ్ల వారీగా బ్యాంకులకు సెలవుల వివరాలు ఓసారి పరిశీస్తే మొత్తం 14 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని సెలవులతో పాటు..
ఆగస్టు 8న టెండాంగ్‌లో ఫాట్ సెలవు
ఆగస్టు 16న పార్శీ కొత్త సంవత్సరం బేలాపూర్, ముంబై, నాగ్‌పూర్‌లో సెలవు
ఆగస్టు 18న శ్రీమంత శంకరదేవ గువాహటిలో సెలవు
ఆగస్టు 28న మొదటి ఓనం కొచ్చి, తిరువనంతపురంలో సెలవు,
ఆగస్టు 29న తిరువోన కొచ్చి, తిరువనంతపురంలో సెలవు
ఆగస్టు 30 రక్షా బంధన్ జైపూర్, షిమ్లాలో సెలవు
ఆగస్టు 31 రక్షా బంధన శ్రీనారాయణ్ గురు జయంతి, పాంగ్ ల్హా బ్సోల్ డెహ్రాడూన్, గ్యాంగ్ టక్, కాన్పూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలో సెలవులు
COMMENTS