Artificial Intelligence AI: Rs. 7 crore salary in Netflix, Amazon..! Having these skills is enough.. Degree is not required..!
Artificial Intelligence AI : నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లో రూ.7 కోట్ల జీతం..! ఈ స్కిల్స్ ఉంటే చాలు.. డిగ్రీ కూడా అవసరం లేదు..!
Netflix Amazon Target AI Experts : మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తమ వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తాయని సంస్థలు భావిస్తున్నాయి. ఏఐ ద్వారా రికమండేషన్ అల్గారిథమ్, థంబ్‌నెయిల్‌లను అందించడం వంటి వాటిని సులభంగా పొందవచ్చని అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
Artificial Intelligence : ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ ద్వారా ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సంస్థలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఏఐని ఉపయోగించి ఆదాయం సమకూర్చుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ క్రమంలో ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence) సంస్థ ఓపెన్ ఏఐ (OpenAI) రూపొందించిన చాట్‌జీపీటీ వంటి టూల్స్‌తో ఉద్యోగాలు పోతాయని కొందరు భయపడుతుండగా.. ఏఐ వల్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని వాదించే వారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చాట్‌జీపీటీ తరహా జనరేటీవ్ ఏఐ వంటి టెక్నాలజీలలో నిపుణులైన వారికి ఏడాదికి రూ.7 కోట్ల వేతనం ఇచ్చేందుకు ముందుకు రావడం గమనార్హం.
డిగ్రీ అవసరం లేదు.. వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కూడా :
నెట్‌ఫ్లిక్స్ తన అఫిషియల్ వెబ్‌సైట్‌లో ఈ జాబ్స్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో మెషిన్‌లెర్నింగ్ ఫ్లాట్ ఫామ్ ప్రొడక్ట్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించేందుకు ఔత్సాహికులైన అభ్యర్ధులు కావాలని పేర్కొంది. అమెరికా కేంద్రంగా కాలిఫోర్నియా కేంద్రంగా నెట్‌ఫ్లిక్స్ ఆఫీస్‌లో పనిచేయాలి. లేదంటే వెస్ట్ కోస్ట్ ప్రాంతం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కూడా ఉంది. ప్రారంభ వేతనం ఏడాదికి 3లక్షల డాలర్ల నుంచి 9లక్షల డాలర్ల వరకు ఉంటుంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 7.4 కోట్లు భారీ వేతనం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. డిగ్రీ అవసరం లేదని పేర్కొంది.
బేసిక్ శాలరీ ఏడాదికి 3లక్షల 40 వేల డాలర్లు.. జీతంతో పాటు బోనస్‌లు అదనం:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలపై జాబ్స్ ఉన్నాయంటూ అమెజాన్ సైతం ప్రకటన చేసింది. సైన్స్ అండ్ జనరేటీవ్ ఏఐలో పని చేసేందుకు సీనియర్ మేనేజర్లు కావాలని పిలుపునిచ్చింది. సైంటిఫిక్ రిసెర్చ్, అప్లికేషన్ ఏఐ టెక్నిక్స్ బృందాన్ని లీడ్ చేసేందుకు టీం లీడర్లు కావాలి. ఏఐ అల్గారిథమ్‌ను ఉపయోగించి మనుషులు ఎలాగైతే ఇమేజెరీ అండ్ వీడియోస్ తయారు చేస్తారో అలాగే తయారు చేసే స్కిల్స్ ఉండాలని సూచించింది. బేసిక్ శాలరీ ఏడాదికి 3లక్షల 40 వేల డాలర్లు.. శాలరీతో సంబంధం లేకుండా ప్రత్యేక బోనస్‌లు అందిస్తామని పేర్కొంది.
COMMENTS