Are the daughters responsible for paying the father's debts?
తండ్రి అప్పులను చెల్లించాల్సిన బాధ్యత కుమార్తెలపై ఉంటుందా..?
బతికి ఉన్నప్పుడు ఏవేవో ప్లాన్స్ వేసుకుంటాం. జీవితం కోసం ఎంతో ముందు ఆలోచన. అందులో భాగంగానే అవసరాలకు తగ్గట్టుగా చాలా మంది లోన్స్ తీసుకోవడం, బయట అప్పు చేయడం వంటివి చేస్తుంటారు. కానీ అవి పూర్తిగా చెల్లించకముందే చనిపోతే.. ? తండ్రి అప్పులను చెల్లించాల్సిన బాధ్యత వారసులపై ఎంత ఉంటుంది. తండ్రి ఆస్తులలో కుమార్తెలకు వాటా ఉంటుంది. మరీ అప్పులలో ఉండదా..? దాని సంగతేంటి..? కుమార్తెలు తండ్రి అప్పులను చెల్లించాలా లేదా..? న్యాయ నిపుణులు ఏం అంటున్నారు..?
ఓ వ్యక్తి చనిపోతే అతని ఆస్తులు వారసులకు చెందుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అతనికి ఎంత మంది సంతానం ఉంటే.. వారందరికీ సమానంగా ఆ ఆస్తిని పొందే హక్కు చట్టం కల్పించింది. కొడుకులు, కూతుళ్లనే తేడా లేకుండా ఆస్తిని పొందే హక్కు ఉంటుంది. అయితే ఓ వ్యక్తి మరణిస్తే అతనికి ఉన్న అప్పుల సంగతేంటి? వాటిని ఎవరు చెల్లించాలి? అన్న విషయంలో నేటికీ అనేక సందేహాలు ఉన్నాయి.
ఆ అప్పులకు, మాకు ఎలాంటి సంబంధం లేదని వారసులు తప్పించుకోవచ్చా? లేదా మా నాన్న మాకు ఏమీ ఇవ్వలేదు కాబట్టి మేము ఆ అప్పులను చెల్లించలేమని చెప్పొచ్చా? ఇలాంటి వివాదాలకు సంబంధించిన వార్తలను డైలీ చూస్తూనే ఉంటాం కదా..! చనిపోయిన వ్యక్తికి అప్పులు ఉంటే అతని వారసులే ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
వారసుడు ఒక్కడే ఉంటే అతనే ఆ మొత్తన్ని చెల్లించాలని చట్టంలో స్పష్టంగా ఉంది. ఒక వేళ ఒకరి కన్నా ఎక్కువ మంది వారసులు ఉంటే.. వారంతా ఆ అప్పును సమానంగా చెల్లించాలని చెబుతున్నారు. అయితే.. తండ్రి అప్పులు చెల్లించే బాధ్యత కుమారులపై ఎంత ఉందో.. కూతుర్లపై కూడా అంతే ఉంటుందని వివరిస్తున్నారు న్యాయ నిపుణులు. ఓ వ్యక్తికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉంటే అతనికి ఉన్న అప్పును మూడు భాగాలు చేసి.. ముగ్గురూ సమానంగా చెల్లించాల్సి ఉంటుంది.
COMMENTS