Aadhaar Voter ID Link: Easy Phone Number Linking to Voter ID with Aadhaar.. Step to Step Details..
Aadhaar Voter ID Link: ఆధార్‌తో ఈజీగా ఓటర్ ఐడీకి ఫోన్ నెంబర్ లింకింగ్.. స్టెప్ టు స్టెప్ వివరాలివే..
Aadhaar Voter ID Link: ఆధార్, ఓటరు గుర్తింపు కార్డుల అనుసంధానం వ్యవహారం కోర్టుకు చేరింది. ప్రభుత్వ ఉద్దేశంపై ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సంబంధిత పిటిషనర్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం కోరింది. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఓటరు గుర్తింపు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ఎన్నికల సంఘం ప్రచారాన్ని ప్రారంభించనుందని మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీకాంత్ దేశ్‌పాండే తెలిపారు. నకిలీ ఓట్లను అరికట్టేందుకు ఇలా చేస్తున్నామని తెలిపారు. ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులను లింక్ చేయడం ద్వారా బోగస్ ఓటర్ ఐడీ కార్డులను రద్దు చేయొచ్చని చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా ఎన్నికల్లో రిగ్గింగ్‌ను ఆపేయడం జరుగుతుందన్నారు.
ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డు లింకింగ్ ప్రక్రియను NVSP విడుదల చేసింది. ఆధార్ కార్డుతో ఓటర్ ఐడీ కార్డును లింక్ చేయాలనుకుంటే.. ఇంట్లోనే కూర్చుని చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం పోర్టర్, ఎస్ఎంఎస్ పంపడం ద్వారా, ఫోన్ ద్వారా ఆధార్ ఓటర్ ఐడీ లింక్ చేయొచ్చు.
NVSP నుండి ఆధార్ ఓటర్ ఐడీ లింక్..
ఈ లింకింగ్‌ను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎన్నికల సంఘం పోర్టర్ ద్వారా కూడా చేయొచ్చు. ముందుగా రాష్ట్ర ఎన్నికల సంఘం పోర్టల్‌కు వెళ్లాలి. పోర్టల్‌లో మీ ఓటర్ ఐడీ నెంబర్ నమోదు చేయాలి. మీ పేరు, పుట్టిన తేదీ మొదలైన ఇతర వివరాలను నమోదు చేయాలి ఆ తరువాత మీ ఆధార్ నెంబర్‌ను నమోదు చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఆధార్ ధృవీకరణ కోసం ఈ OTPని నమోదు చేయాలి. ఆధార్ ఓటర్ ఐడి లింకింగ్ స్టేటస్‌ను చెక్ చేయడానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది.
SMS ద్వారా ఆధార్ ఓటర్ ID లింకింగ్..
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి మెసేజ్ పంపాల్సి ఉంటుంది. ఈ మెసేజ్‌ను 166 లేదా 51969కి పంపాలి. మెసేజ్ ఫార్మాట్ ఇలా ఉంటుంది: ECLINK స్పేస్ EPIC నంబర్ స్పేస్ ఆధార్ నంబర్.
ఫోన్ ద్వారా ఆధార్ ఓటర్ ఐడీ లింకింగ్..
ఆధార్ ఓటర్ ఐడి కార్డులను లింక్ చేయడానికి భారత ప్రభుత్వం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేక కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఓటర్లు 1950 నంబర్‌కు కాల్ చేసి ఆధార్ నంబర్‌తో పాటు తమ ఓటర్ ఐడి వివరాలను ఇవ్వాలి. దీనితో రెండు పత్రాలు లింక్ చేయడం జరుగుతుంది. మీ ఆధార్ ఓటర్ ఐడీ లింకింగ్ పూర్తి అయ్యాక.. మొబైల్ ఫోన్‌లో దానికి సంబంధించిన మెసేజ్ వస్తుంది.
ఇలా కూడా ఆధార్ ఓటర్ ఐడీ లింక్ చేయొచ్చు..
ప్రతి రాష్ట్రంలో అనేక మంది బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOs) ఉంటారు. వీరు ఈ మొత్తం సమాచారాన్ని సేకరించి, ఓటర్ ID కార్డ్‌తో ఆధార్ కార్డ్‌ని లింక్ చేస్తారు. తమ పరిధిలోని ప్రజలకు ఈ సౌకర్యం కల్పించేందుకు ఎప్పటికప్పుడు క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. ఆ క్యాంప్‌కు వెళ్లి ఆధార్ ఓటర్ ఐడి వివరాలను ఇచ్చి ఈ రెండు డాక్యూమెంట్లను లింక్ చేయొచ్చు. అయితే ఇందుకోసం మీ BLOకి ఆధార్ ఓటర్ ID కు సంబంధించిన స్వీయ ధృవీకరన కాపీని అందించాలి. ఆ తరువాత ఆధార్ ఓటర్ ఐడి లింకింగ్ గురించి BLO ద్వారా మీకు సమాచారం అందుతుంది.
COMMENTS