Aadhaar Shila: A special scheme for women.. Rs. 11 lakh per hand at once.. How much should be paid per day?
Aadhaar Shila: మహిళలకు ప్రత్యేకమైన స్కీమ్.. ఒకేసారి చేతికి రూ.11 లక్షలు.. రోజుకు ఎంత కట్టాలంటే?
Aadhaar Shila: ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ సూపర్ ప్లాన్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ పథకంలో రోజుకు రూ.87 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ నాటికి మీకు రూ. 11 లక్షలు అందుతాయి. పాలసీ తీసుకునేందుకు అర్హతలు, ప్రీమియం చెల్లింపుల వంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Aadhaar Shila: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసీ తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాలసీలను వారి అవసరాలకు అనుగుణంగా తీసుకొస్తుంటుంది. ముఖ్యంగా మహిళల కోసం ఇప్పటికే అనేక రకాల ప్లాన్లు ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే ఎల్ఐసీ ఆధార్ శీలా పేరుతో మరో అద్భుతమైన పాలసీ ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చేరి రోజుకు కేవలం రూ. 87 పొదుపు చేసినట్లయితే మెచ్యూరిటీ నాటికి ఏకంగా రూ.11 లక్షలు అందుకోవచ్చు. ఈ పాలసీ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎల్ఐసీ ఆధార్ శీలా అనేది వ్యక్తిగత జీవిత బీమా పాలసీ. దీనిని మహిళల కోసం మాత్రమే తీసుకొచ్చారు. ఈ స్కీమ్ తీసుకున్న వారెవరైనాసరే దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి బీమా సొమ్ము అందుతుంది. ఈ పాలసీ తీసుకోవాలంటే బాలికలు లేదా మహిళల వయసు 8 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. వీరికి కచ్చితంగా ఆధార్ ఉండాలి. ఈ ప్లాన్ కాల వ్యవధి 10 నుంచి 20 ఏళ్ల మధ్య ఉంటుంది. అలాగే ప్లాన్ మెంట్యూరిటీ సమయానికి మహిళ గరిష్ఠ వయసు 70 ఏళ్లు మించకూడదు. ఈ ప్లాన్ టెన్యూర్ 20 ఏళ్లు ఉన్నప్పటికీ అది పాలసీ తీసుకునే వారి ఇష్ట ప్రకారం ఎంచుకోవచ్చు. ఉదాహరణకు 55 ఏళ్ల వయసు ఉన్న మహిళ కేవలం 15 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ కలిగిన ప్లాన్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ పీరియడ్ 70 ఏళ్లకు మించకుండా చూసుకోవాలి.
మీరు రోజుకు రూ. 87 చొప్పున ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మెచ్యూరిటీ సమయానికి రూ. 11 లక్షలు సొంతం చేసుకునేందుకు ఎల్ఐసీ ఆధార్ శీలా పాలసీ మంచి ఆప్షన్. ఇందులో మీరు ఏడాదికి రూ. 31, 755 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 60 ఏళ్ల వయసున్న ఓ మహిళ 10 ఏళ్ల వ్యవధి కలిగిన ప్లాన్ ఎంచుకున్నారనుకుందాం. అలాగే ఆమెకు 70 ఏళ్లు వచ్చే సరికి కేవంల రూ. 3,17,550 మాత్రమే ప్రీమియం కింద చెల్లిస్తుంది. మెచ్యూరిటీ పీరియడ్ గరిష్ఠంగా 70 ఏళ్లే కాబట్టి ఆ సమయానికి పాలసీ హోల్డర్లకు అక్షరాల రూ. 11 లక్షలు అందుతాయి. మొత్తంగా ఎల్ఐసీ అందిస్తున్న ఈ స్కీమ్ ద్వారా జీవిత బీమా కవరేజీ ప్రయోజనాలితో పాటు భవిష్యత్తులో వచ్చే ఆర్థిక ఇబ్బందులను మహిళలు ఎదుర్కొనేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. మహిళలు పొందుపు చేసుకునేందుకు మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు.
COMMENTS