Aadhaar: Lock Your Aadhaar Biometric.. Simple Process!
Aadhaar: మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేసుకోండిలా.. సింపుల్ ప్రాసెస్!
Aadhaar: ఆధార్ కార్డులోని వేలి ముద్రలు వంటి బయోమెట్రిక్ సమాచారాన్ని ఇతరులు యాక్సెస్ చేయకుండా లాక్ చేసుకునే సదుపాయం ప్రస్తుతం అందుబాటులో ఉంది. సైబర్ మోసాలు పెరుగుతున్న క్రమంలో ప్రతిఒక్కరు తమ వివరాలను లాక్ చేసుకోవడం మంచిది. ఎలా లాక్ చేసుకోవాలి, మళ్లీ ఎలా అన్‌లాక్ చేసుకోవాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Aadhaar: ఆధార్ కార్డు అనేది ఎంత ముఖ్యమైన డాక్యుమెంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త సిమ్ తీసుకోవాలన్నా, బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోవాలన్నా ఇలా ప్రతి దానికీ ఆధార్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. వేలి ముద్రను నమోదు చేయగానే మన వివరాలు వచ్చేస్తాయి. అవసరమున్న ప్రతి చోటా ఆధార్‌తో పాటు వేలి ముద్ర వివరాలు ఇచ్చేస్తుంటాం. అయితే, దీనినే అదునుగా తీసుకొని సైబర్ నేరగాళ్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. వివిధ మార్గాల ద్వారా వేలి ముద్రలను సేకరించి నగదును కాజేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి బయోమెట్రిక్‌ను లాక్ చేసుకోవడం ఉత్తమం. కావాల్సినప్పుడు అన్‌లాక్ చేసుకోవచ్చు. దీంతో ఇతరులు మీ ప్రమేయం లేకుండా బయోమెట్రిక్ వివరాలను వినియోగించడానికి కుదరదు.
ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఎలా చేయాలి?
- మైఆధార్ పోర్టల్‌లోకి ఆధార్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి.
- స్క్రీన్ పై లాక్/ అన్‌లాక్ బయోమెట్రిక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అందులో లాక్, అన్‌లాక్ మీకు ఎలా ఉపయోగపడుతుందనేది వివరణ ఉంటుంది. ఆ పేజీలో కనిపించే నెక్ట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- వెంటనే ప్లీజ్ సెలెక్ట్ టూ లాక్ ఓపెన్ అవుతుంది. కింద ఉన్న టర్మ్స్ బ్యాక్స్‌లో టిక్ చేసి నెక్ట్స్ పై క్లిక్ చేయాలి.
- Your Biometric Have Been Locked Successfully అని స్క్రీన్‌పై కనబడుతుంది. అంతే మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ అయిపోతుంది. లాక్ అవ్వగానే లాక్/ అన్‌లాక్ బయోమెట్రిక్ ఆప్షన్ ఎరుపు రంగులో లాక్ అవుతుంది.
బయోమెట్రిక్ అన్‌లాక్ చేసుకోవడం ఎలా?
- పోర్టల్‌లో లాగిన్ అవ్వగానే లాక్/ అన్‌లాక్ బయోమెట్రిక్ ఆప్షన్ ఎరుపు రంగులో నిపిస్తుంది. ఇలా ఉంటే మీ బయోమెట్రిక్ లాక్ అయిందని అర్థం.
- అన్‌లాక్ కోసం పైన చెప్పిన పద్దతిలోనే చేయాలి. ఇందులో Please Select To Lock టర్మ్స్ బాక్సులో టిక్ చేయగానే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
- మీ బయోమెట్రిక్ అన్‌లాక్ తాత్కాలికమా లేదా శాశ్వతంగానా అని అడుగుతుంది. ఇందులో మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.
- ఎంచుకొని నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి. Your Biometrics Have Been Unlocked Successfully అని స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- తాత్కాలికంగా అన్‌లాక్ ఆప్షన్ ఎంచుకుంటే కేవలం 10 నిమిషాలు మాత్రమే మీ బయోమెట్రిక్ అన్‌లాక్ అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- శాశ్వతంగా అన్‌లాక్ ఆప్షన్ ఎంచుకుని మీ పని పూర్తి చేసుకున్నాక మళ్లీ లాక్ చేసుకోవచ్చు.
COMMENTS