Aadhaar Card: Need to update anything in Aadhaar Card? Free service till September 30..!
Aadhaar Card: ఆధార్ కార్డులో ఏదైనా అప్‌డేట్ చేసుకోవాలా? సెప్టెంబర్ 30 వరకు ఫ్రీ సర్వీస్..!
myAadhaar: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 వరకు myAadhaar పోర్టల్‌లో ఆధార్ ఫ్రీ అప్‌డేషన్ సర్వీస్ ప్రారంభించింది. దీంతో ఇక ప్రజలు తమ ఆధార్ డాక్యుమెంట్స్‌ను ఎలాంటి ఖర్చు లేకుండానే అప్‌డేట్ చేసుకోవచ్చు.
Aadhaar Free Update: ఆధార్ కార్డు భారతీయులకు ఎంత ముఖ్యమైన డాక్యుమెంటో అనేది తెలిసిందే. ఇది ప్రతి పనిలోనూ కీలకంగా మారిపోయింది. అయితే ఆధార్‌లో వాలిడ్ డేటా లేకపోతే ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే ఇందులో సమాచారం కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోవాలి. ఇందుకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్‌ను కూడా ఎన్‌రోల్‌మెంట్ డేట్ నుంచి కనీసం పదేళ్లకు ఒకసారైనా ఆధార్ కార్డులో అప్‌డేట్ చేసుకోవాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 30 వరకు myAadhaar పోర్టల్‌లో ఆధార్ ఫ్రీ అప్‌డేషన్ సర్వీస్ ప్రారంభించింది. దీంతో ఇప్పుడు ఆధార్ డాక్యుమెంట్లను ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే అప్‌డేట్ చేసుకోవచ్చన్నమాట. ఆధార్ కార్డును ఫ్రీగా ఎలా అప్‌లోడ్ చేసుకోవాలంటే.. తొలుత myAadhaar పోర్టల్ https://myaadhaar.uidai.gov.in/ ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది.
అక్కడ మెనూలో డాక్యుమెంట్ అప్‌డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆధార్‌లో ప్రస్తుతం ఉన్న వివరాలు కనిపిస్తాయి. వివరాలన్నీ వెరిఫై చేసుకొని.. నెక్ట్స్ హైపర్‌లింక్‌పైన క్లిక్ చేయాలి. డ్రాప్‌డౌన్ లిస్ట్ నుంచి.. గుర్తింపు కార్డు, అడ్రస్ డాక్యుమెంట్ల ప్రూఫ్ సెలక్ట్ చేసుకోవాలి.
ఇక అవసరమైన సపోర్టింగ్ డాక్యుమెంట్ల స్కాన్డ్ కాపీలు అప్‌లోడ్ చేయాలి. అవి చాలా క్లియర్, కలర్డ్ కాపీలుగా ఉండాలి. ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ కోసం అందించే సపోర్టింగ్ డాక్యుమెంట్స్‌లో పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ID కార్డు, రేషన్ కార్డ్ ఇలా ఏదైనా ఉండొచ్చు. పేరు, పుట్టిన తేదీ ప్రూఫ్ కోసం బర్త్ సర్టిఫికెట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్, ఓటర్/పాన్ కార్డు, పాస్ పోర్టు వంటివి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేశాక.. సబ్మిట్ ఆప్షన్‌పై నొక్కాలి. తర్వాత మీ మొబైల్ నంబర్‌కు అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. అప్పుడు UIDAI వెబ్‌సైట్‌లో రిక్వెస్ట్ స్టేటస్ కూడా ట్రాక్ చేయొ్చు.
ఇప్పుడు ఫ్రీ అప్‌డేషన్ సర్వీస్ myAadhaar పోర్టల్‌లో సెప్టెంబర్ 30 వరకు ఫ్రీగా అందుబాటులో ఉండగా.. ఆధార్ సెంటర్లలో మాత్రం అప్‌డేట్ చేయించుకోవాలనుకుంటే.. రూ. 50 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
COMMENTS