Bank News: Bad news for customers.. Shocking announcement of 3 big banks
Bank News: కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్.. ఒకేసారి 3 పెద్ద బ్యాంకుల షాకింగ్ ప్రకటన.
Interest Rates: బ్యాంక్ కస్టమర్లకు చేదువార్త. లోన్లు పొందాలనుకునేవారిపై మరింత భారం పడనుంది. పలు దిగ్గజ బ్యాంకులు ఒకేసారి కీలక ప్రకటనలు జారీ చేశాయి. హోం లోన్, వెహికిల్ లోన్, పర్సనల్ లోన్‌లపై వడ్డీ రేట్లు పెరిగాయి. దీంతో ఈఎంఐలు ఎక్కువ కట్టాల్సిందే. ఏయే బ్యాంకులు ఏయే నిర్ణయాలు తీసుకున్నాయో ఇప్పుడు చూద్దాం.
Home Loan Interest rates: ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకులు .. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇది కస్టమర్లపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపనుంది. మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లను - MCLR (రుణ ఆధారిత వడ్డీ రేట్లు) సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. వేర్వేరు కాలపరిమితులపై వేర్వేరుగా మార్పులు చేశాయి. ఇక ఈ ప్రకటనలు ఆగస్ట్ 1 నుంచే అమల్లోకి వస్తాయని ఆయా బ్యాంకులు తమ వెబ్‌సైట్లలో వెల్లడించాయి. ఇంతకీ ఆ నిర్ణయాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంసీఎల్‌ఆర్ రేట్లు అనేవి బ్యాంకులు తాము ఇచ్చే ఆయా లోన్లపై ప్రామాణికంగా అమలు చేసే వడ్డీ రేటు. అన్ని బ్యాంకులు ఒకే విధానాన్ని పాటించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిని తీసుకొచ్చింది. ఈ ఎంసీఎల్‌ఆర్ రేట్లు పెంచితే దీనికి అనుసంధానంగా ఉన్న వెహికిల్ లోన్, పర్సనల్ లోన్, హోం లోన్ సహా అన్ని రకాల లోన్లపై ఈఎంఐలు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అందుకే ఇది రుణగ్రహీతలపై చెడు ప్రభావం చూపిస్తుందని చెప్పొచ్చు.
ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank)
ఐసీఐసీఐ బ్యాంక్ MCLR రేట్లను 5 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది అన్ని కాలవ్యవధులపై వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఇప్పుడు ఈ దిగ్గజ బ్యాంకులో ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్, ఒక నెల ఎంసీఎల్‌ఆర్ రేట్లు 8.35 శాతం నుంచి 8.40 శాతానికి పెరిగింది. ఇక 3 నెలలు, 6 నెలల MCLR వరుసగా 8.45 శాతం, 8.80 శాతానికి చేరాయి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank Of India)
ప్రభుత్వ రంగానికే చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కఠిన నిర్ణయం తీసుకుంది. తన ఎంసీఎల్‌ఆర్ రేట్లలో కొన్ని కాలవ్యవధులపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఇప్పుడు ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్ రేట్లు 7.95 శాతంగా ఉంది. ఇక ఒక నెల MCLR రేటు విషయానికి వస్తే 8.15 శాతంగా ఉంది. 3 నెలలు, 6 నెలల ఎంసీఎల్‌ఆర్ రేట్లు వరుసగా 8.30 శాతం, 8.50 శాతంగా ఉన్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank)
మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రం తన ఎంసీఎల్‌ఆర్ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. పీఎన్‌బీ వెబ్‌సైట్ ప్రకారం.. ఇప్పుడు ఓవర్‌నైట్ MCLR ఇప్పుడు 8.10 శాతంగా ఉంది. ఇక ఒక నెల ఎంసీఎల్‌ఆర్ రేటు 8.20 శాతం, 3 నెలలు, 6 నెలల ఎంసీఎల్‌ఆర్ రేట్లు వరుసగా 8.30 శాతం, 8.50 శాతంగా ఉన్నాయి.
COMMENTS