Wrong Recharge: Have you mistakenly recharged on another number..? Doing this will get your money back!
Wrong Recharge: మీరు పొరపాటున మరొక నంబర్‌లో రీఛార్జ్ చేశారా..? ఇలా చేస్తే డబ్బు తిరిగి వస్తుంది!
మొబైల్‌లో రీఛార్జ్ చెల్లుబాటు గడువు ముగిసిన సందేశం వచ్చినప్పుడల్లా టెన్షన్ పెరుగుతుంది. అయితే కొన్ని సమయాల్లో ఒక నంబర్‌కు రీఛార్జ్ చేయబోయి మరో నంబర్‌కు రీఛార్జ్ అవుతుంది. అలాంటి సమయంలో డబ్బులు వృధా అయ్యాయని ఆందోళనకు గురవుతుంటాము. పొరపాటున వేరే నంబర్‌కు చేసిన రీఛార్జ్ డబ్బులు రావని టెన్షన్‌కు గురవుతుంటాము. ఇప్పుడు మీ టెన్షన్‌ని దూరం చేద్దాం. ఎందుకంటే రాంగ్ నంబర్‌లో రీఛార్జ్ చేసిన తర్వాత మీరు కంపెనీ నుంచి డబ్బును తిరిగి పొందవచ్చు. టెలికాం కంపెనీ నుంచి వాపసు పొందే మార్గం చాలా సులభం.
పొరపాటున మీరు ఏదైనా ఇతర నంబర్‌లో రీఛార్జ్ చేస్తే, వెంటనే రీఫండ్ ప్రక్రియను అనుసరించండి. పొరపాటు జరిగిన రీఛార్జ్ విషయంలో కంపెనీలు డబ్బును రీఫండ్ చేసే అవకాశాన్ని ఇస్తాయి. వ్యక్తులు తమ మొబైల్ నంబర్‌కు బదులుగా వేరే నంబర్‌లో రీఛార్జ్ చేసినప్పుడు ఇది చాలాసార్లు జరుగుతుంది. రీఛార్జ్ అమౌంట్ ఉంటే ఇలాగే వదిలేస్తాం కానీ, ఎక్కువ డబ్బు ఖర్చయితే ఆందోళన పెరుగుతుంది.
ఈ విధంగా వాపసు పొందుతారు
అయితే ఇప్పుడు మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రీఛార్జ్ చిన్నదైనా లేదా పెద్దదైనా మీరు కంపెనీ నుంచి వాపసు తీసుకోవచ్చు. తప్పుడు మొబైల్ నంబర్‌లో రీఛార్జ్ చేసిన తర్వాత డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవచ్చో చూద్దాం.
మీరు తప్పు నంబర్‌లో రీఛార్జ్ చేసి ఉంటే, వెంటనే దాని గురించి కస్టమర్ కేర్‌కు తెలియజేయండి. మీరు ఏ సిమ్ ఉపయోగిస్తున్నారో ఆ కంపెనీ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి పూర్తి వివరాలు చెప్పండి. ఇది కాకుండా మీరు టెలికాం కంపెనీ ఇమెయిల్ ఐడికి కూడా మెయిల్ చేయవచ్చు. దీనిలో మీరు రీఛార్జ్ చేసిన మొబైల్ నంబర్, రీఛార్జ్ మొత్తం, లావాదేవీతో సహా అన్ని వివరాలను ఇవ్వాలి. మీరు కింద టెలికాం కంపెనీల ఇమెయిల్ ఐడిని చూడవచ్చు.
Vodafone-Idea: customercare@vodafoneidea.com ఎయిర్‌టెల్: airtelpresence@in.airtel.com JIO- care@jio.com. మీరు ఇచ్చిన సమాచారాన్ని టెలికాం కంపెనీలు ధృవీకరిస్తాయి. దీని తర్వాత మీ డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది.
మీకు వాపసు రాకపోతే ఏం చేయాలి?
కంపెనీ మీ డబ్బును తిరిగి ఇవ్వడానికి ఇష్టపడకపోతే ఇతర ఆప్షన్లను ఉపయోగించుకోవచ్చు. మీరు కస్టమర్ సర్వీస్ పోర్టల్ అంటే వినియోగదారుల ఫోరమ్ సహాయం తీసుకోవచ్చు. మీరు దాని యాప్‌ని Google Play Store, Apple App Store నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కంపెనీకి వ్యతిరేకంగా ఇక్కడ ఫిర్యాదు చేయండి. అది మీకు సహాయపడవచ్చు.
ఇంకో విషయం ఏంటంటే మీరు రీఛార్జ్ చేసుకున్న నంబర్ మీ నంబర్‌తో సమానంగా ఉంటుందని ఉండి తీరాలి. మీ నంబర్, పొరపాటు చేసిన రీఛార్జ్ నంబర్ మధ్య ఒకటి లేదా రెండు సంఖ్యల వ్యత్యాసం ఉండాలి. సంఖ్య పూర్తిగా భిన్నంగా ఉంటే కంపెనీ వాపసు ఇవ్వడానికి నిరాకరించవచ్చు.
COMMENTS