WhatsApp Chat Lock: Keep WhatsApp Chats Secret? Lock it simply like this..
WhatsApp Chat Lock: వాట్సప్ ఛాట్స్ సీక్రెట్‌గా ఉంచాలా? సింపుల్‌గా లాక్ చేయండి ఇలా..
స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒకరి స్మార్ట్‌ఫోన్ మరొకరు ఉపయోగించడం ఈరోజుల్లో మామూలే. అయితే ఇలాంటి సమయంలో ప్రైవసీ సమస్యలు వస్తుంటాయి. వాట్సప్‌లో ఎవరు ఏం ఛాటింగ్ (WhatsApp Chatting) చేసారో తెలుసుకోవడం చాలా సులువు.
ముఖ్యమైన ఛాటింగ్ ఉంటే డిలిట్ చేయడం సాధ్యం కాదు. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? వాట్సప్ ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టింది. వాట్సప్‌లో సీక్రెట్ ఛాట్స్‌ని (Secret Chats) లాక్ చేయొచ్చు. ఫింగర్‌ప్రింట్‌తో ఆ ఛాట్స్ ఓపెన్ అవుతాయి. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు వాట్సప్ ఛాట్ లాక్ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ ఫీచర్ ఎలా వాడుకోవాలో తెలుసుకోండి.
స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ ఛాట్ లాక్ చేయండిలా
- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేయాలి.
- మీరు ఎవరి ఛాట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో వారి డీపీ పైన క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ఇన్ఫో ఐకాన్ పైన క్లిక్ చేయాలి.
- కిందకు స్క్రోల్ చేస్తే Chat lock పైన క్లిక్ చేయాలి.
- Lock this chat with fingerprint ఎనేబుల్ చేయాలి.
మీరు సెలెక్ట్ చేసిన ఛాట్ లాక్ అవుతుంది. ఇక ఆ ఛాట్ మీరు వాట్సప్ ఓపెన్ చేయగానే కనిపించదు. Locked Chats ఫోల్డర్‌లో కనిపిస్తాయి. మీరు వాట్సప్ ఓపెన్ చేయగానే కిందకు స్వైప్ చేస్తే Locked Chats ఫోల్డర్ కనిపిస్తుంది. మీరు లాక్ చేసిన ఛాట్స్ అన్నీ ఆ ఫోల్డర్‌లోనే ఉంటాయి. మీరు ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ ఐడీతో ఆ ఛాట్స్ ఓపెన్ చేయొచ్చు.
మీ వాట్సప్‌లోని ఛాట్స్ ఇతరులు చదవకూడదనుకున్నప్పుడు ఈ ఫీచర్ వాడుకోవచ్చు. ఈ ఫీచర్ ఇండివిజ్యువల్ ప్రొఫైల్‌కు ఉపయోగించాల్సి ఉంటుంది. ఇలా మీరు ఎన్ని ఛాట్స్ అయినా లాక్ చేయొచ్చు. ఈ ఫీచర్‌తో గ్రూప్ ఛాట్స్, మ్యూటెడ్ ఛాట్స్ లాక్ చేయడం సాధ్యం కాదు. కాల్స్ కూడా బ్లాక్ కావు. మీరు వాట్సప్ బ్యాకప్ చేసి, మళ్లీ రీస్టోర్ చేసినా ఆ ఛాట్స్ లాక్డ్ ఫోల్డర్‌లోనే ఉంటాయి.
COMMENTS