Telangana: Good news for the unemployed.. Sarkar green signal for 1,654 guest lecturer posts in junior colleges
Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. జూనియర్ కాలేజీల్లో 1,654 గెస్ట్ లెక్చరర్ పోస్టులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది అతిథి అధ్యాపకుల (గెస్ట్ లెక్చరర్లు) నియామకానికి సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్మీడియెట్ కమిషనర్ నవీన్ మిత్తల్ మంగళవారం (జులై 18) ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన నియామక మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు. జూనియర్ కాలేజీల్లో ప్రభుత్వం అతిథి అధ్యాపకులకు ఒక్కో పీరియడ్‌కు నిమిత్తం రూ.390 చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐతే నెలకు గరిష్ఠంగా 72 పీరియడ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ లెక్కన నెలకు రూ.28,080 చొప్పున వేతనం అందించనున్నట్లు వెల్లడించింది.
జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా ఇంటర్ విద్యా శాఖ అధికారి, ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా నియామక కమిటీ ఏర్పాటు చేస్తారు. జిల్లాల్లోని జూనియర్ కాలేజీల వారీగా ఖాళీలను ఈ రోజు వెల్లడిస్తారు. అర్హతలున్నవారు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. 26వ తేదీన మెరిట్ జాబితా వెల్లడిస్తారు. ఎంపికైన గెస్ట్ లెక్చరర్ల జాబితా ఈ నెల 28న జిల్లా కలెక్టర్ వెల్లడిస్తారు. ఆగస్టు 1న సంబంధిత కాలేజీల ప్రిన్సిపాళ్లకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. గతంలో జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లుగా ఉన్న వారిని తిరిగి కొన సాగించకపోవడంతో వారిలో ఆందోళన నెల కొంది.
***Update(23-8-2023): ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి ఇంటర్మీడియట్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. 1654 గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ విడుదల చేసింది. 1654 గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ విడుదల చేసింది. జులై 19 నుంచి ఈ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. జులై 24వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అయితే తాజాగా.. తెలంగాణ హైకోర్టు ఈ నోటిఫికేషన్ ను రద్దు చేస్టున్నట్లు ప్రకటించింది. గతంలో గెస్ట్ లెక్చరర్ల నోటిఫికేషన్‌పై పనిచేసిన 1654 మంది లెక్చరర్స్ ఈ నోటిఫికేషన్ విడుదలపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. హైకోర్టును ఆశ్రయించారు. గత పదేళ్లుగా పని చేస్తున్న 1654 మంది గెస్ట్ లెక్చరర్లను వెంటనే యధావిధిగా విధుల్లోకి తీసుకోవాలని న్యాయమూర్తి జస్టిస్ మాధవి ప్రభుత్వాన్ని ఆదేశించారు.
COMMENTS