Telangana Jobs: Notification for contract jobs in Telangana.. Chance for those who have done Tenth, Inter, Degree, PG.. Details
Telangana Jobs: తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ చేసిన వారికి ఛాన్స్.. వివరాలివే
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (TS Govt Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 9 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
కౌన్సెలర్, శిశు గృహ మేనేజర్, సోషల్ వర్కర్, ఏఎన్ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు.
అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు ఈ నెల 14ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
విద్యార్హతలు:
వివిధ పోస్టులకు వివిధ విద్యార్హతలను నిర్ణయించారు. టెన్త్, ఇంటర్, బీఎస్సీ నర్సింగ్, గ్రాడ్యుయేషన్, పీజీ, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 21-35 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయో పరిమితిలో ఐదేళ్ల పాటు సడలింపు ఇచ్చారు. అభ్యర్థులు ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
వేతనం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టు ఆధారంగా నెలకు రూ.7944-రూ.23170 వరకు వేతనం ఉంటుంది.
దరఖాస్తు: అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను బాల రక్షా భవన్ కార్యాలయం, పాత డీఆర్డీఏ కార్యాలయం, బుర్హాన్ పురం, ఖమ్మం చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది.
Important Links:
FOR WEBSITE CLICKHERE
COMMENTS