Sukanya Samriddhi: Investing in Sukanya Samriddhi? If this doesn't work your account will be frozen!
Sukanya Samriddhi: సుకన్య సమృద్ధిలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ పని చేయకపోతే మీ అకౌంట్ ఫ్రీజ్!
Sukanya Samriddhi: సుకన్య సమృద్ధి యోజనలో పాప పేరుపై డబ్బులు జమ చేస్తున్నారా? అయితే, మీకో అలర్ట్. మీరు వెంటనే ఈ పని పూర్తి చేయాలి. లేదంటే మీ అకౌంట్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Sukanya Samriddhi: కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో డబ్బులు జమ చేస్తున్న వారికి అలర్ట్. ఈ స్కీమ్‌కు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. ఈ కొత్త నిబంధనలు పాటించకపోతే సుకన్య సమృద్ధి అకౌంట్ ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. 10 ఏళ్లలోపు బాలికల పేరుపై ప్రతీ నెలా ఈ పథకంలో పొదుపు చేస్తే దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ వస్తాయి. ఈ స్కీమ్‌లో వడ్డీ కూడా ఎక్కువ. దీంతో ఈ పథకంలో చేరేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
సుకన్య సమృద్ధి యోజన లో ఇన్వెస్ట్ చేస్తున్న వారు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు నంబర్, పాన్ కార్డు నంబర్ లింక్ చేయాలి. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌కు పాన్ నంబర్, ఆధార్ నంబర్ లింక్ చేయకపోతే ఆ అకౌంట్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ తో పాటు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లాంటి చిన్నమొత్తాల పొదుపు పథకాలకు ఈ రూల్ వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్చి 31, 2023 నోటిఫికేషన్ ప్రకారం చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సంబంధించి కేవైసీ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. గతంలో ఈ సేవింగ్స్ స్కీమ్స్‌లో చేరడానికి ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఉండేది కాదు. కొత్త రూల్స్ ప్రకారం ఆధార్ నంబర్ లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్ తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది.
ఈ సేవింగ్స్ స్కీమ్స్‌లో ఏదైనా సందర్భంలో బ్యాలెన్స్ రూ.50 వేలు దాటినా, ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక అకౌంట్‌లో రూ.1 లక్షకు మించి డబ్బులు జమ చేసినా లేదా ఒక నెలలో ఒక అకౌంట్ నుంచి రూ.10 వేలకు మించి విత్‌డ్రా లేదా బదిలీ చేసినా పాన్ నంబర్ సబ్మిట్ చేయాలి. పాన్ నంబర్ లేనివాళ్లు తప్పనిసరిగా పాన్ కార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదా ఫామ్ 60 సబ్మిట్ చేయాలి. పాన్ నెంబర్ సబ్మిట్ చేయకపోతే అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. ఇక కొత్తగా సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లాంటి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో చేరే వారు తప్పనిసరిగా తమ ఆధార్ నంబర్ ఇవ్వాలి. అకౌంట్ ఓపెన్ చేసేప్పుడు ఆధార్ నంబర్ ఇవ్వనట్టైతే 6 నెలల్లో ఆధార్ నెంబర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ ఫ్రీజ్ అయితే మళ్లీ మీకు వచ్చే వడ్డీ రేటు ఆగిపోయే ప్రమాదం లేకపోలేదు. అలాగే మీరు ఖాతా తీసుకున్న బ్యాంకు, పోస్టాఫీసు వద్దకు వెళ్లి అన్ని డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది.
COMMENTS