SBI: SBI YONO.. How to make UPI payments for any customer? This is the step by step process..!
SBI: ఎస్‌బీఐ YONO.. ఏ కస్టమరైనా యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..!
SBI: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తన యోనో యాప్‌ను ఇతర బ్యాంక్ కస్టమర్లకు కూడా చేరువ చేసింది. ఈ యాప్‌ను ఏ బ్యాంక్ కస్టమరైనా.. యూపీఐ పేమెంట్స్ చేసేందుకు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఇదెలా చేయాలో మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం.
SBI: భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ఇటీవల ఒక ప్రకటనతో గేమ్‌ఛేంజర్‌గా అవతరించింది. కేవలం SBI మాత్రమే కాకుండా ఏ ఇతర బ్యాంక్ కస్టమర్ అయినప్పటికీ.. తన YONO APP ను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేజ్ (UPI) పేమెంట్స్ కోసం వాడుకోవచ్చని స్పష్టం చేసింది. దీని కోసం 'YONO For Every Indian' పేరిట కొత్త సేవల్ని తీసుకొచ్చింది. ఇది ప్రతి కస్టమర్‌కు కూడా యూపీఐ పేమెంట్స్ వెసులుబాటు కల్పించే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్స్ యాప్స్‌కు సవాల్ విసిరేదే అని చెప్పొచ్చు. ఇప్పుడు SBI YONO APP ద్వారా వేరే బ్యాంక్ కస్టమర్లు.. అంటే బ్యాంకులకతీతంగా స్కాన్ అండ్ పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి యూపీఐ ఫీచర్స్‌ను SBI Yonos New Avatar లో ఇప్పుడు వినియోగించుకోవచ్చు.
డిజిటల్ పేమెంట్స్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు, వీలైనంత ఎక్కువ మందికి చేరువ చేయాలనే లక్ష్యంతో ఎస్‌బీఐ ఈ సేవల్ని తీసుకొచ్చింది. ప్రతి భారతీయ పౌరుడు.. డిజిటల్ పేమెంట్స్ సేవల్ని మెరుగ్గా వినియోగించుకునేందుకు ఈ ఎస్‌బీఐ యోనో కొత్త అవతారం దోహద పడుతుందని చెప్పొచ్చు. సాధారణంగా బ్యాంకులు వంటి వాటికి సంబంధించి బ్రాండ్స్ చూస్తారనడంలో సందేహం లేదు. ఇప్పుడు దిగ్గజ బ్యాంక్, కోట్లాది కస్టమర్లు ఉన్న SBI ఈ యూపీఐ సేవల్ని అందరి కోసం తీసుకొస్తుండటం నిజంగా గేమ్‌ఛేంజర్.
నాన్- SBI యూజర్లకు SBI YONO ద్వారా యూపీఐ పేమెంట్లు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
- తొలుత SBI YONO మొబైల్ బ్యాంకింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది.
- అక్కడ New to SBI, Register Now అనే ఆప్షన్లు ఉంటాయి.
- ఎస్‌బీఐ యూజర్లు కాని వారు రిజిస్టర్ నౌ పై క్లిక్ చేయాలి.
- నెక్ట్స్ పేజీలో .. Register to Make UPU Payments అని ఉంటుంది.. అక్కడ మీ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న సిమ్ కార్డు ఎంచుకోవాలి.
- మీ మొబైల్ నంబర్ వెరిఫై పూర్తి అయిన తర్వాత .. మీ UPI ID క్రియేట్ చేసేందుకు బ్యాంక్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీరు బ్యాంక్‌ను లిస్ట్ నుంచి సెలక్ట్ చేసుకోవచ్చు.. లేదా సెర్చ్ కూడా చేయొచ్చు.
- తర్వాత మీరు SBI Pay చేసేందుకు కన్ఫర్మేషన్ మెసేజ్ ఒకటి వస్తుంది.
- తర్వాత మీరు SBI UPI హ్యాండిల్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీకోసం ఎస్‌బీఐ 3 ఆప్షన్లు ఇస్తుంది. మీరు ఒకటి ఎంచుకుంటే సరిపోతుంది.
- మీరు యూపీఐ ఐడీ సెలక్ట్ చేసుకున్న తర్వాత .. కన్ఫర్మేషన్ మెసేజ్ పొందుతారు.
- అకౌంట్ లాగిన్ అయ్యేందుకు MPIN సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆరంకెల్లో ఉంటుంది.
- MPin సెట్ చేసుకున్న తర్వాత.. మీరు SBI Yono యాప్ ద్వారా యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు.
COMMENTS