SBI: SBI Big Alert for bank customers.. Important announcement on online banking!
SBI: బ్యాంక్ కస్టమర్లకు ఎస్‌బీఐ బిగ్ అలర్ట్.. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌పై కీలక ప్రకటన!
SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అలర్ట్. ఎస్‌బీఐ కీలక ప్రకటన చేసింది. యూజర్ల డేటాను క్షేమంగా భద్రపరచే అంశంపై తమ కస్టమర్లను అప్రమత్తం చేసింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ లో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను వెల్లడించింది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
SBI: ప్రస్తుతం అంతా డిజిటల్ మయం. ఏ చిన్న ఆర్థిక లావాదేవీ చేయాలన్నా యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్‌లు తమ ఖాతాదారులకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా బ్యాంక్ అడిగిన వివరాలను పూర్తి నమ్మకంతో వెబ్‌సైట్‌లో అందిస్తుంటారు కస్టమర్లు. అలాగే యూజర్ల డేటాను క్షేమంగా భద్రపరచడానికి బ్యాంకులు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటాయి. అనధికార యాక్సెస్‌ల నుంచి యూజర్లను రక్షించడానికి ఎప్పటికప్పుడు బ్యాంకులు అలర్ట్ చేస్తుంటాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా తమ ఖాతాదారులకు కీలక సూచనలు చేసింది.
డిజిటల్ బ్యాంకింగ్‌పై ఖాతాదారులకు ఎస్‌బీఐ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తుంది. ఈ నెల 27న ఎస్‌బీఐ యూజర్లకు ఇమెయిల్ ద్వారా కీలక సూచనలు చేసింది. రోజురోజుకూ ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలు పెరిగి పోతున్నందున సేఫ్టీ ప్రొటోకాల్స్ హైలైట్ చేస్తూ కస్టమర్లను అలర్ట్ చేసింది. కస్టమర్ల పాన్ కార్డ్ నంబర్, KYC వివరాలను అప్‌డేట్ చేయాలని, యోనో (YONO) యాప్‌ని అన్‌బ్లాక్ చేయాలని ఎస్‌బీఐ కోరదు. ఇలా అడుగుతూ బ్యాంక్ సిబ్బంది ఫోన్ కాల్ చేయరని, ఎస్ఎంఎస్ పంపించబోరని స్పష్టం చేసింది. వ్యక్తిగత వివరాలు, పాస్‌వర్డ్, ఓటీపీ వంటివి చెప్పాలని వచ్చే మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏదైనా ఇ-మెయిల్, ఎస్ఎంఎస్ అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 1930 లేదా 1800111109 నంబర్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్‌బీఐ తెలిపింది. report.phishing@sbi.co.in అడ్రస్‌కి ఇ-మెయిల్ లేదా https://cybercrime.gov.in వెబ్‌సైట్‌లోనూ రిపోర్ట్ చేయొచ్చని సూచించింది. https://crcf.sbi.co.in/ccf/ వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చని పేర్కొంది. ప్లే స్టోర్, యాప్ స్టోర్‌ల నుంచే బ్యాంక్‌కి చెందిన మొబైల్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. తరచుగా పాస్‌వర్డ్, MPIN మార్చుతూ ఉండాలని, మాల్‌వేర్‌ల నుంచి ప్రొటెక్షన్ కల్పించుకోవాలి కోరింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యోనో లైట్ (YONO Lite), యోనో ఎస్బీఐ (YONO SBI) యాప్‌లలోనే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది ఎస్‌బీఐ. 2021 డిసెంబర్ 1 నుంచే వెబ్ పోర్టల్ సేవలు నిలిపివేసినట్లు తెలిపింది. యోనో ఎస్బీఐ లైట్ యాప్‌లు పంపించే ఓటీపీలను థర్డ్ పార్టీ యాప్‌లతో ఓపెన్ చేయొద్దని పేర్కొంది. సైబర్ నేరగాళ్లు వీటిపై ఓ కన్నేసి ఉంచుతారని హెచ్చరించింది. బ్యాంక్ కస్టమర్లు అలాంటి మెసేజ్‌లు, కాల్స్ పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కోరింది బ్యాంక్. ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపింది.
COMMENTS