SBI Account: Good news for farmers.. If you open an account in SBI, Rs. 3 lakhs,
SBI Account: రైతులకు శుభవార్త.. ఎస్‌బీఐలో అకౌంట్ తెరిస్తే రూ.3 లక్షలు, ఈ స్కీమ్‌తో సూపర్ బెనిఫిట్.
రైతులకు తీపికబురు. దేశంలోనే దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రైతులకు ప్రత్యేకమైన సేవలు అందిస్తోంది.
బ్యాంక్‌కు (Bank) వెళ్లి అకౌంట్ తెరిస్తే.. ఏకంగా రూ. 3 లక్షల వరకు రుణం పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. రైతుల (Farmers) కోసం కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్‌ను తీసుకువచ్చింది. మీరు ఎస్‌బీఐ సహా మరే ఇతర బ్యాంక్‌కు వెళ్లి అయినా ఈ స్కీమ్ కింద అకౌంట్ తెరవొచ్చు.
కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ కింద బ్యాంక్‌కు వెళ్లి ఖాతా తెరిస్తే.. రైతులకు రూ. 3 లక్షల వరకు రుణం లభిస్తుంది. తక్కువ వడ్డీ రేటుకే రుణాలు పొందొచ్చు. తీసుకున్న రుణాన్ని సరైన సమయానికి చెల్లిస్తూ వస్తే.. వడ్డీ రేటు 3 శాతం తగ్గుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ టెన్యూర్ ఐదేళ్లు. లోన్ మొత్తాన్ని ప్రతి ఏటా 10 శాతం చొప్పున పెంచకుంటూ వస్తారు. అంతేకాకుండా కేసీసీ రుణ గ్రహాతలకు రూపే డెబిట్ కార్డులు కూడా అందిస్తారు.
అంతేకాకుండా రైతులకు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన కింద ఇన్సూరెన్స్ పొందొచ్చు. ప్రీమియం చెల్లించాలి. అలాగే రూపే కార్డు కలిగిన వారు ప్రమాద బీమా కింద రూ. 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పొలం పట్టా వంటి డాక్యుమెంటలు అవసరం అవుతాయి.
రూ. 3 లక్షల వరకు రుణ మొత్తానికి అయితే 7 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. రూ. 3 లక్షలకు పైన అయితే వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. రూ. 3 లక్షల వరకు లోన్‌పై అయితే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. రైతులు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండా యోనో యాప్ ద్వారా కూడా కేసీసీ లోన్ పొందొచ్చు. ఆన్‌లైన్‌లో డిజిటల్ రూపంలో లోన్ లభిస్తుంది. బ్యాంక్ అందించే 7 శాతం వడ్డీ రేటుపై కేంద్రం 3 శాతం సబ్సిడీ ఇస్తుంది. అంటే అప్పుడు కేవలం 4 శాతం వడ్డీ రేటుకే రైతులకు రూ. 3 లక్షల వరకు రుణం లభిస్తుంది. అందుకే అన్నదాతలు ఈ ఛాన్స్ ఉపయోగించుకోవచ్చు. అయితే లోన్ తీసుకున్న వారు కరెక్ట్ టైమ్‌కు లోన్ చెల్లిస్తూ రావాలి.
COMMENTS