Railways : notification release for 1,104 posts.
Railways:నిరుద్యోగులకు గుడ్ న్యూస్ 1,104 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ సంస్థలోని 1,104 పోస్టులను భర్తీ చేస్తుంది. అర్హత, ఎంపిక ప్రక్రియ ఇతర వివరాలను తెలుసుకోగలరు.
నార్త్ ఈస్టర్న్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు RRC గోరఖ్‌పూర్ అధికారిక సైట్ rrcgorakhpur.net ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 03.07.2023న ప్రారంభించారు. 02.08.2023న ముగుస్తుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ సంస్థలోని 1,104 పోస్టులను భర్తీ చేస్తుంది. అర్హత, ఎంపిక ప్రక్రియ ఇతర వివరాలను తెలుసుకోండి.
ఖాళీ వివరాలు:
మెకానికల్ వర్క్‌షాప్/ గోరఖ్‌పూర్: 411 పోస్టులు
సిగ్నల్ వర్క్‌షాప్/ గోరఖ్‌పూర్ కాంట్: 63 పోస్ట్‌లు
బ్రిడ్జ్ వర్క్‌షాప్ /గోరఖ్‌పూర్ కాంట్: 35 పోస్ట్‌లు
మెకానికల్ వర్క్‌షాప్/ ఇజ్జత్‌నగర్: 151 పోస్టులు
డీజిల్ షెడ్ / ఇజ్జత్‌నగర్: 60 పోస్టులు
క్యారేజ్ & వ్యాగన్ / ఇజ్జత్‌నగర్: 64 పోస్ట్‌లు
క్యారేజ్ & వ్యాగన్ / లక్నో : 155 పోస్ట్‌లు
డీజిల్ షెడ్ / గోండా: 90 పోస్టులు
క్యారేజ్ & వ్యాగన్ /వారణాసి: 75 పోస్టులు
అర్హత:
అభ్యర్థి కనీసం 50శాతం మార్కులతో హైస్కూల్/10వ తరగతికి సంబంధించిన నిర్దేశిత విద్యార్హత, ITI ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
ఎంపిక ప్రక్రియ మెరిట్ జాబితాపై ఆధారపడి ఉంటుంది, ఇది మెట్రిక్యులేషన్ (కనీసం 50శాతం మార్కులతో], ITI పరీక్ష రెండింటిలోనూ అభ్యర్థులు పొందిన మార్కుల శాతం సగటున లెక్కిస్తారు.
దరఖాస్తు రుసుము:
అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.100/- చెల్లించాలి. SC/ST/EWS/దివ్యాంగులు(PwBD)/మహిళా అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
మరోవైపు సౌత్ వెస్ట్రన్ రైల్వేకి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. నైరుతి రైల్వే రిక్రూట్మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్ట్ 2, 2023 చివరి తేదీగా నిర్ణయించింది. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు, మైసూర్ & హుబ్లీలలో పోస్టింగ్ ఇస్తారు.
ఖాళీల వివరాలు: హుబ్లీ డివిజన్ లో 237, క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్ హుబ్లీ- 217, బెంగళూరు డివిజన్ లో 230, మైసూర్ డివిజన్ లో 177, సెంట్రల్ వర్క్‌షాప్, మైసూర్ లో 43 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సౌత్ వెస్ట్రన్ రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి 10వ తరగతి, ITI, NTC పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
సౌత్ వెస్ట్రన్ రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థుల వయస్సు ఆగస్టు 2, 2023 నాటికి 15 ఏళ్లు , గరిష్టంగా 24 ఏళ్లకు మించకూడదు. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PwD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో పరిమితి సడలింపు ఉంటుంది.
COMMENTS