Unclaimed Deposits: The bank that is giving too much money.. Just have an account.. 100 days scheme Shuru!
Unclaimed Deposits: పిలిచి మరీ డబ్బులు ఇస్తోన్న బ్యాంక్.. అకౌంట్ ఉంటే చాలు.. 100 డేస్ స్కీమ్ షురూ!
Unclaimed Deposits: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో టాప్-3లో ఉంటుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్. తాజాగా ఈ బ్యాంక్ తమ కస్టమర్లకు అదిరే శుభవార్త అందించింది. కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. 100 డేస్ 100 పేమెంట్స్ పేరుతో ఈ కొత్త ప్రోగ్రామ్ చేపడుతోంది. దీని ద్వారా చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పవచ్చు. ఈ కొత్త స్కీమ్ సెప్టెంబర్ 8 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా బ్యాంక్ కస్టమర్లకు అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను సెటిల్ చేస్తోంది బ్యాంక్. దేశంలోని ప్రతి జిల్లాలో ఈ ప్రోగ్రామ్ నిర్వహించనుంది బ్యాంక్.
బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 10 ఏళ్లకుపైగా ఎలాంటి లావాదేవీలు జరపని ఖాతాల్లోని అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల సెటిల్‌మెంట్ కోసం కొత్త వెబ్‌సైట్ తీసుకుస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పదేళ్లకు పైగా ఎవ్వరూ విత్‌డ్రా చేసుకోని డబ్బుల వివరాలను ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. బ్యాంక్ కస్టమర్లు వారికి సంబంధించిన డబ్బులను బ్యాంక్ పోర్టల్‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. తమకు సంబంధించిన అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ తాము వినియోగించని ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటివి ఉన్నట్లయితే వెంటన డబ్బులు పొందొచ్చు.
బ్యాంక్ అకౌంట్ తెరిచిన తర్వాత పదేళ్లకుపైగా ఎవ్వరూ డబ్బులు విత్‌డ్రా చేసుకోకపోయినటువంటి అకౌంట్లను ఇన్‌ఆపరేటివ్ ఖాతాలుగా పేర్కొంటారు. ఇలాంటి ఖాతాల నుంచి డబ్బులు పొందాలని బ్యాంకులు ఇప్పడు కస్టమర్లను కోరుతున్నాయి. కస్టమర్ లేదా చట్టపరమైన వారసులు లేక ఆథరైజ్డ్ సిగ్నేటరీస్ ఈ అకౌంట్లలోని డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లలోని డబ్బులు పొందటానికి బ్యాంక్‌కు వెళ్లి అప్లకేషన్ సమర్పిస్తే సరిపోతుంది.
కస్టమర్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వాలి. అలాగే గుర్తింపు కార్డు, అడ్రస్, ఫోటోగ్రఫ్ వంటివి సమర్పించాలి. వెరిఫికేషన్ తర్వాత ఇన్ఆపరేటివ్ బ్యాంక్ అకౌంట్‌ను యాక్టివ్ చేస్తారు. తర్వాత మీరు ట్రాన్సాక్షన్ నిర్వహించొచ్చు. ఖాతాదారుడు లేకపోతే వారి నామినీ కూడా అన్‌క్లెయిమ్ డిపాజిట్లను పొందొచ్చు. https://www.pnbindia.in/inoperactive-accounts.aspx ద్వారా మీరు పీఎన్‌బీలోని అన్‌క్లెయిమ్ డిపాజిట్ల వివరాలు పొందొచ్చు. మీ పేరు, కోడ్ వంటివి ఎంటర్ చేసి మీరు మీ పేరుపై ఏమైనా అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయో తెలుసుకోవాలి. మీ పూర్తి వివరాలు కనిపిస్తాయి. అందులో మీ పేరు ఉంటే మీకు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం కోసం ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
COMMENTS