Prasar Bharati Jobs: Broadcasting jobs in Telangana.. vacancies in 18 districts..
Prasar Bharati Jobs: తెలంగాణలో ఆకాశవాణి ఉద్యోగాలు.. 18 జిల్లాల్లో ఖాళీలు..
తెలంగాణ రాష్ట్రంలోని 18 జిల్లాల్లో పార్ట్ టైమ్ కరస్పాండెంట్ల(పీటీసీ) నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఉపసంచాలకులు మహేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని 18 జిల్లాల్లోని కరస్పాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆశాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తల యూనిట్ పార్టమ్
కరస్పాండెంట్ల (PTCల) నియామకానికి తెలంగాణ రాష్ట్రంలోని 18 జిల్లాల్లోని కరస్పాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
క్రింద పేర్కొన్న జిల్లాలలో దరఖాస్తులు కోరుతోంది.
1. హైదరాబాద్
2. భద్రాద్రి కొత్తగూడెం .
3. జయశంకర్ భూపాలపల్లి.
4. జోగులాంబ గద్వాల్
5. కొమరం భీం అసిఫాబాద్
6. మహబూబ్ నగర్ .
7. మెదక్
8. ములుగు
9. నాగర్ కర్నూలు
10. నారాయణపేట.
11. నిర్మల్
12. నిజామాబాద్
13. పెద్దపల్లి
14. రంగారెడ్డి
15. వికారాబాద్.
16. వరంగల్ (అర్బన్)/హనుమకొండ
17. యాదాద్రి భువనగిరి.
18. కామారెడ్డి .
వయోపరిమితి..
దరఖాస్తులు చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 24 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు..
PG డిప్లొమా/ జర్నలిజంలో డిగ్రీ/మాస్ మీడియా లేదా గ్రాడ్యుయేట్ కలిగి జర్నలిజంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి. అభ్యర్థులు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో లేదా సంబంధిత జిల్లా మునిసిపాలిటీకి 10 కిమీ పరిధిలో నివసించి ఉండాలి.
దరఖాస్తులు ఇలా..
పూర్తి వివరాలు అండ్ దరఖాస్తు ఫారం లకు అధికారిక వెబ్సైట్ www.newsonair.gov.in ను సందర్శించి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది.
డౌన్ లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారమ్ లో వ్యక్తిగత వివరాలతో పాటు.. విద్యార్హత వివరాలను నింపాల్సి ఉంటుంది. తర్వాత దరఖాస్తుతో స్వయం ధృవీకరణ చేసిన సర్టిఫికేట్ల కాపీలను జత చేయాలి.
విద్యార్హత సర్టిఫికేట్లకు సంబంధించి ఒక జిరాక్స్ సెట్ ను పంపించాలి. దీంతో పాటు.. రెండు పాస్ పోర్ట్ ఫొటో గ్రాఫ్ లతో సహా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఈ), ఆశాశవాణి, సైఫాబాద్, హైదరాబాద్ - 500004 అడ్రస్ కు పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదీ జులై 31, 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
Important Links:
Notification for Video Post Production Assistant CLICKHERE
Notification for engagement of Videographer CLICKHERE
Notification for engagement of Senior Correspondent CLICKHERE
Notification for engagement of Packaging Assistant CLICKHERE
Notification for engagement of Copy Editor CLICKHERE
Notification for engagement of Content Executive CLICKHERE
Notification for engagement of Bulletin Editor CLICKHERE
Notification for engagement of Broadcast Executive CLICKHERE
Notification for engagement of Assignment Coordinator CLICKHERE
Notification for engagement of Anchor-Cum-Correspondent Grade-III CLICKHERE
Notification for engagement of Anchor-Cum-Correspondent Grade-II CLICKHERE
COMMENTS