Part time job in LIC.. four hours work is enough
ఎల్ఐసీలో పార్ట్ టైమ్ జాబ్.. నాలుగు గంటలు పని చేస్తే చాలు.
ఈరోజుల్లో ఒక్క జాబ్ చేస్తే వచ్చే శాలరీ సరిపోవడం లేదు. పార్ట్ టైమ్‌గా ఏదో ఒకటి చేస్తే వచ్చే ఆ కాస్త శాలరీ ఖర్చులకు పోయినా అసలు జీతంతో బండిని ఈడ్చుకోవచ్చు. సైడ్ ఇన్కమ్ 5-10వేలు వచ్చినా చాలు అని చాలా మంది అనుకుంటున్నారు. పార్ట్ టైమ్ జాబ్ చేయాలనుకునే వాళ్లకు ఎల్ఐసీ ఒక మంచి అవకాశం ఇస్తోంది. దేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) పార్ట్ టైం ఏజెంట్‌గా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం పదో తరగతి పాసై ఉంటే సరిపోతుంది.
ఎల్ఐసితో రోజుకు 4 గంటలు పని చేస్తే చాలు. పార్ట్ టైమ్ ఏజెంట్‌గా చేరి ఇంట్లో కూర్చొని పనిచేయవచ్చు. క్లయింట్‌తో సంప్రదింపులు చేయవచ్చు. ఇందుకోసం ముందుగా ఎల్ఐసీలో ఏజెంట్‌గా చేరాలి. తర్వాత మీకు కావలసినంత సంపాదించుకోవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ కమీషన్ వస్తుంది. అంటే ఈ వ్యాపారంలో సంపాదన అపరిమితంగా ఉంటుంది.
6 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, 10వ తరగతి మార్క్ షీట్, చిరునామా రుజువు, ఓటరు ID, ఆధార్ కార్డు, వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత, పాన్ కార్డ్ కాపీ ఈ పత్రాలు కావాల్సి ఉంటుంది.
ఆదాయం ఎలా..?
ఎల్ఐసి తన ఏజెంట్లకు పాలసీ మొత్తంలో 25% వరకు కమీషన్ చెల్లిస్తుంది. ఇది పాలసీ మొదటి విడతలో మాత్రమే వర్తిస్తుంది. తర్వాత కమీషన్ తగ్గుతూ ఉంటుంది. పాలసీదారు ఇన్‌స్టాల్‌మెంట్‌ను డిపాజిట్ చేసినన్ని సార్లు ఏజెంట్‌కు కమీషన్ లభిస్తుంది. ఏజెంట్ పాలసీని ఒకసారి చేయిస్తే సరిపోతుంది. తర్వాత ప్రతి ఇన్స్టాల్ మెంట్లో కమీషన్ లభిస్తుంది.
అర్హత..
ఎల్ఐసీ ఏజెంట్ కావడానికి 10వ తరగతి ఉత్తీర్ణులై 18 ఏళ్లు నిండి ఉండాలి. నగరానికి సమీపంలోని ఎల్ఐసి బ్రాంచ్‌కి వెళ్లి అక్కడ డెవలప్మెంట్ అధికారిని కలవాలి. బ్రాంచ్ మేనేజర్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మీరు ఈ ఉద్యోగానికి సరిపోతారని భావిస్తే శిక్షణ కోసం పంపుతారు. శిక్షణ 25 గంటల పాటు ఉంటుంది. ఇందులో మీకు జీవిత బీమా వ్యాపారం గురించి వివరంగా చెబుతారు. తరువాత IRDAI నిర్వహించే ప్రీ-రిక్రూట్మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. పరీక్షలో ఉత్తీర్ణులైన వారు బీమా ఏజెంట్ అపాయింట్మెంట్ లెటర్, గుర్తింపు కార్డును పొందుతారు.
కానీ పార్ట్ టైమ్ జాబ్ అంటే ఆడుతూ పాడుతూ కూల్‌గా చేసేదిలా ఉంటేనే మనం మెయిన్ వర్క్ మీద ఫోకస్ చేస్తాం. కానీ నాలుగు గంటలపాటు ఇలా దీనిమీదే వ్చచ్చిస్తే.. మీరు అసలు జాబ్‌ను పక్కనపెట్టాల్సి వస్తుంది. మీరు ఉద్యోగాన్ని బట్టి దీన్ని ఎంచుకోవాలో వద్దో డిసైడ్ అవ్వండి.
COMMENTS