Pan Aadhar Link: Aadhaar not linked with PAN? But twenty percent of that income is Fasak.
Pan Aadhar Link: పాన్‌తో ఆధార్ లింక్ చేసుకోలేదా? అయితే ఆ రాబడిలో ఇరవై శాతం సొమ్ము ఫసక్..
ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) ఇతర పెట్టుబడి ఎంపికలతో పోలిస్తే బంపర్ రాబడిని అందిస్తున్నాయి. అలాగే పెట్టుబడికి భద్రత ఉండడతో ఎక్కువ మంది ఎఫ్‌డీల్లో పెట్టుబికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టడం సులభంగా ఉన్నప్పటికీ నిర్ణయం తీసుకునే ముందు మార్గదర్శకాలను గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే సీనియర్ సిటిజన్లు కాని వ్యక్తులకు రూ. 40,000 కంటే ఎక్కువ ఎఫ్‌డీ వడ్డీపై టీడీఎస్ తీసివేస్తారు. అయితే సీనియర్ సిటిజన్లకు మాత్రం వడ్డీ రూ. 50,000 దాటిన తర్వాత టీడీఎస్ వర్తిస్తుంది. అంతేకాకుండా మెచ్యూరిటీ సమయంలో కాకుండా మీ ఎఫ్‌డీకి క్రెడిట్ చేసిన లేదా జోడించిన వడ్డీపై టీడీఎస్ తీసివేస్తారు. ఉదాహరణకు మీరు 3-సంవత్సరాల ఎఫ్‌డీని కలిగి ఉంటే, వడ్డీని చెల్లిస్తున్నప్పుడు బ్యాంక్ ఏటా టీడీఎస్‌ను తీసివేస్తుంది. ఎఫ్‌డీ పెట్టుబడులను పరిగణనలోకి తీసుకునేటప్పుడు ఈ మార్గదర్శకాలు ముఖ్యమైన రిమైండర్‌లుగా పనిచేస్తాయి. మీ ఆధార్-పాన్ లింకేజీని నిర్ధారించుకోవడం, అలాగే మీ పాన్ కార్డ్‌ని మళ్లీ యాక్టివేట్ చేయడం అనేది అధిక టీడీఎస్ రేట్లను ఉపశమనం పొందడానికి సాయం చేస్తాయి
ఆధార్ పాన్ లింక్ కాకపోతే పాన్ ఇన్‌యాక్టివ్
ముఖ్యంగా ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టేటప్పుడే మీ ఆధార్ మీ పాన్ కార్డ్‌కి లింక్ చేశారో? లేదో? నిర్ధారించుకోవాలి. ఇలా చేయకపోతే మీ పాన్ కార్డ్ చెల్లదు. పర్యవసానంగా బ్యాంకులు ఎఫ్‌డీల కోసం ఫారమ్ 15 జీ /హెచ్‌ని అంగీకరించవు. అలాగే మీరు 10 శాతానికి బదులుగా 20 శాతం సోర్స్ (టీడీఎస్) రేటు విధిస్తాయి. మీరు జూన్ 30లోపు మీ పాన్‌తో మీ ఆధార్‌ని లింక్ చేయకుంటే, మీ పాన్ కార్డ్ చెల్లుబాటు కానట్లుగా పరిగణిస్తారు.
పాన్‌ని మళ్లీ యాక్టివేట్ చేయడం ఇలా
అదనపు పన్ను చిక్కులను నివారించడానికి మీరు తప్పనిసరిగా మీ పాన్ కార్డ్‌ని మళ్లీ యాక్టివేట్ చేయాలి. నివేదికల ప్రకారం జూన్ 30 నుండి నిష్క్రియంగా ఉన్న పాన్ కార్డ్‌ని మళ్లీ యాక్టివేట్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రూ. 1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీ పాన్ కార్డ్ ఇన్‌యాక్టివేట్‌గా ఉన్న సమయంలో మళ్లీ యాక్టివేట్ చేయడానికి 30 రోజులు పడుతుందని గుర్తుంచుకోవాలి. అంటే ఒక నెల తర్వాత మీ పాన్ కార్డ్ మళ్లీ పూర్తిగా పని చేస్తుంది.
COMMENTS