NRI PAN: Is your PAN card closed? Activate again like this.. Required Documents!
NRI PAN: మీ పాన్ కార్డు క్లోజ్ అయిందా? ఇలా మళ్లీ యాక్టివేట్ చేసుకోండి.. కావాల్సిన పత్రాలివే!
NRI PAN: పాన్ కార్డుతో ఆధార్ నంబర్ లింక్ చేయడం అనేది తప్పనిసరి. ఈ రెండింటిని లింక్ చేసేందుకు ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో చాలా మంది పాన్ కార్డులు పని చేయకుండా పోయాయి. అయితే, మళ్లీ వాటిని తిరిగి పని చేసేలా చేయొచ్చు. అందుకు కొన్ని డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఎన్ఆర్ఐలకు ఎలాంటి పత్రాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
NRI PAN: గడువు లోపు పాన్ కార్డుతో ఆధార్ నంబర్ లింక్ చేయకపోయినట్లయితే పాన్ పని చేయకుండా పోతుందని ఇప్పటికే ఐటీ శాఖ స్పష్టం చేసింది. అయితే, ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (NRIs) ఎవరైతే ఆధార్ తీసుకోలేదో వారికి మినహాయింపు ఉంటుంది. మరోవైపు.. పాన్, ఆధార్ లింక్ చేసుకునేందుకు గడువు జూన్ 30, 2023తో ముగిసిపోయింది. లింక్ చేయడంలో విఫలమైన చాలా మంది పాన్ కార్డులు పని చేయకుండా పోయాయి. కొన్ని కేసుల్లో ఎన్ఆర్ఐలు తమ రెసిడెన్స్ స్టేటస్ నాన్ రెడిసెండ్ ఇండియన్‌గా అప్‌డేట్ చేసుకోని వారి పాన్ కార్డులను నిలిపివేసింది ట్యాక్స్ డిపార్ట్‌మెంట్. దీంతో మినహాయింపు ఉన్నప్పటికీ చాలా మంది ఎన్ఆర్ఐల పాన్ కార్డులు పని చేయకుండా పోయాయి.
ఇప్పటికీ ఎన్ఆర్ఐల పాన్ కార్డు పని చేయకుండా ఉన్నట్లయితే వారు మళ్లీ పని చేసేలా చేయవచ్చు. అయితే, ముందుగా వారు వారి ఎన్ఆర్ఐ స్టేటస్ వివరాలను సంబంధిత జురిసిడిక్షనల్ ఎసెస్సింగ్ ఆఫీసర్ (JAO)కు సమాచారం అందించాలి. అలాగే అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి.
ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ప్రకారం ఎన్ఆర్ఐలు తమ పాన్ కార్డును యాక్టివేట్ చేసుకునేందుకు ఎలాంటి పత్రాలు సమర్పించాలో జాబితా ఓసారి పరిశీలిద్దాం.
- పాన్ కార్డు కాఫీ
- ఎన్ఆర్ఐ ఎక్కడ నివసిస్తున్నారని తెలిపేందుకు పాస్‌పోర్ట్ కాపీ లేదా
- కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పర్సన్ ఆఫ్ ఇండియన్ ఓరిజిన్ (PIO) కార్డు లేదా
- కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డు లేదా
- ఇతర దేశాల పౌరసత్వ గుర్తింపు నంబర్ లేదా
- ట్యాక్స్ పేయర్ ఐడెంటిఫికేషన్ నంబర్ అపోస్టైల్ అటెస్టేట్ చేసి ఉండాలి.
- ఇండియన్ ఎంబసీ లేదా హైకమీషన్ లేదా ఇతర దేశాల్లోని భారత కాన్సులేట్ లేదా సంబంధిత అధికారి అటెస్టేషన్ ఉండాలి.
పాన్ కార్డు పని చేయకుండా పోయిన నాన్ రెసిడెంట్ ఇండియన్స్ తప్పనిసరిగా తమ రెసిడెంట్ స్టేటస్‌ను జేఏఓకు తెలియజేయాలి. అందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి నో యువర్ ఏఓ ట్యాప్ ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ సంబంధిత జేఏఓ ఎవరో తెలుసుకుని కావాల్సిన పత్రాలు సమర్పించాలి. ఇప్పటికే దాదాపు 10 కోట్ల మంది ఎన్ఆర్ఐల పాన్ కార్డులు పని చేయకుండా పోయినట్లు వార్తలు వచ్చాయి. పలువురు ప్రవాస భారతీయులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆదాయపు పన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది.
COMMENTS