No one in this village has eyesight..even animals..what is the reason?
ఈ గ్రామంలో ఎవరికీ కంటి చూపు ఉండదు.. జంతువులకు కూడా.. కారణం ఏంటంటే?
ఈ ప్రపంచంలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. అనేక వింతలూ, విడ్డూరాలు దాగి ఉన్నాయి. నమ్మశక్యం కాని విషయాలు చాలానే ఉన్నాయి. వాటిలో అంధుల గ్రామం ఒకటి.
మెక్సికోలో బ్లైండ్ విలేజ్ గా పేరొందిన ఈ గ్రామంలో అందరూ అంధులే ఉన్నారు. ఒక్కరికి కూడా కంటి చూపు లేదు, ఉండదు కూడా. మనుషులే కాదు, అక్కడ జంతువులు కూడా గుడ్డివే. మెక్సికోలోని టిల్టెపాక్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో పుట్టిన శిశువులకు కంటి చూపు ఉంటుంది. కానీ ఎదిగేకొద్దీ కంటి చూపు దూరమవుతూ వస్తుంది. కొన్నాళ్ళకు పూర్తిగా కంటి చూపు అనేది పోతుంది. ఆ ఊరిలో ఒక్కరికి కూడా కళ్ళు కనబడవు. అందరూ చీకటిలోనే జీవిస్తున్నారు. చీకటితోనే జీవిస్తున్నారు.
మీకే ఎందుకు ఇలా అవుతుంది అని అడిగితే.. ఆ గ్రామంలో శాపానికి గురైన చెట్టు ఉందని, ఆ చెట్టు వల్లే తమ గ్రామానికి అంధత్వం వచ్చిందని చెబుతారు. లావాజులా అనే చెట్టు ఉందని.. దాన్ని చూసినవారికి కంటి చూపు పోతుందని, జంతువులు కూడా కంటిచూపును కోల్పోతాయని చెబుతారు. అయితే ఇది మూఢనమ్మకం మాత్రమే అని, దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. శాస్త్రవేత్తలు చెప్తున్న దాని ప్రకారం.. ప్రత్యేక జాతులకు చెందిన విషపూరిత ఈగలే ఆ గ్రామంలో కంటి చూపు కోల్పోవడానికి కారణం. ఈ ఈగలు కుట్టడం వల్ల క్రమంగా చూపు కోల్పోతున్నారని.. జంతువులు చూపు కోల్పోవడానికి కూడా ఈ ఈగలే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే మెక్సికన్ ప్రభుత్వం ఆ గ్రామస్తుల సంక్షేమం కోసం చాలా ప్రయత్నాలు చేసింది. కానీ అవన్నీ విఫలమయ్యాయి. ఈ గ్రామస్తులందరినీ వేరే ప్రదేశంలో చేర్చాలని ప్రభుత్వం భావించింది. కానీ వారికి ప్రస్తుతం ఉంటున్న వాతావరణం తప్ప మరే వాతవరణం వారి శరీరాలకు సహకరించదు. కొత్త ప్రదేశంలో నివసించడానికి వారు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీంతో వారు ఆ గ్రామంలోనే చీకటిలో జీవిస్తున్నారు. కొంతమంది వారసత్వంగా తమ పూర్వీకుల నుంచి వచ్చిందని అంటున్నారు. కానీ దీనికి త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నామని గ్రామస్తులు అంటున్నారు.
COMMENTS