Twitter: Tweet and earn money on X.Com.. What you need.. These are the qualifications..
Twitter: ట్వీట్లు చేసి X.Com లో డబ్బులు సంపాదించేయండి.. ఏం కావాలి.. అర్హతలు ఇవే..
Twitter Make Money: ట్విట్టర్ పేరును దాని అధినేత ఎలాన్ మస్క్ X.com గా మార్చిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ లోగో కూడా x పేరుతో నింపేశారు. ఇక ట్వీట్లను x లు అని పిలవాలని చెప్పారు. అయితే ఇప్పుడు మస్క్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ట్వీట్లతోనూ డబ్బులు సంపాదించుకోవచ్చు.
Elon Musk: టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ (X) అధినేత ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ యూజర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ట్వీట్లతో డబ్బులు సంపాదించుకునే వీలు కల్పించారు. దీని కోసం మస్క్ యాడ్ రెవెన్యూ షేరింగ్ ఫీచర్ డెవలప్ చేశారు. దీని సాయంతో యూజర్లు ఎక్స్.కామ్‌లో చేసే ట్వీట్లపై యూజర్ల ఎంగేజ్మెంట్ ఆధారంగా ఆయా కంపెనీల యాడ్స్ డిస్ప్లే కానున్నాయి. వాటికి అనుగుణంగా యూజర్లు మనీ ఎర్న్ చేయొచ్చు. ఈ ఫీచర్లపై ఎక్స్.కామ్ యాజమాన్యం స్పందించింది. కంటెంట్ క్రియేటర్లు ఈ ఫీచర్ వినియోగించుకొని.. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో (x.com) నేరుగా డబ్బులు సంపాదించుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ భారత్ సహా ప్రపంచ దేశాల్లోనూ అందుబాటులోకి తెచ్చింది.
ఎక్స్.కామ్‌లో యూజర్లు డబ్బులు సంపాదించుకునేందుకు అర్హతలు ఇవే..
x.com లో యాడ్స్ రెవెన్యూ ఫీచర్ పొందాలంటే తొలుత యూజర్లు ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఎక్స్.కామ్ గుర్తింపు పొందిన సంస్థ ఉండాలి.
3 నెలల లోపల యూజర్లు చేసిన ట్వీట్లపై 15 మిలియన్ ఇంప్రెషన్లు ఉండాలి.
500 ఫాలోవర్స్ కచ్చితంగా ఉండాలి.
పైన చెప్పిన అర్హతలు ఉంటే యూజ్లు ఇక ఎక్స్.కామ్ నుంచి డబ్బులు పొందొచ్చు. దీని కోసం యూజర్లు వాడే డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డుల్లో స్ట్రైప్ ఆప్షన్ తప్పనిసరిగా ఉండాలి. స్ట్రైప్ అనేది ఒక సర్వీస్ మాత్రమే. ఈ స్ట్రైప్ సర్వీసుల్ని ఆయా బ్యాంక్‌లు, ఇతర ఫైనాన్షియల్ కంపెనీలు అందిస్తుంటాయి. ఈ స్ట్రైప్ ప్లాట్‌ఫాం ద్వారా ఎక్స్.కామ్ యూజర్ల అకౌంట్లకు డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది.
అంతేకాక.. అర్హులైన యూజర్లు కంపెనీ ప్రకటనల రాబడి వాటా నిబంధనలు పాటించాలి. ఈ నిబంధనల్లో క్రియేటర్ మానిటైజేషన్ ప్రమాణాలు, ఎక్స్.కామ్ నియమాలున్నాయి. సెట్టింగ్స్ల్లోని మానిటైజేషన్ ఆప్షన్‌ను యాక్సెస్ చేయడంతో వినియోగదారులు క్రియేటర్ సబ్స్క్రిప్షన్స్, యాడ్స్ రెవెన్యూ షేరింగ్ రెండింటికీ అప్లై చేసుకోవచ్చు. ఇక వినియోగదారులు.. యాడ్స్ రెవెన్యూ షేర్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వారు ఎక్స్.కామ్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం కోల్పోతారు.
ఎక్స్.కామ్‌లో సంపాదించిన డబ్బుల్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
తొలుత ఎక్స్.కామ్‌లోని ట్వీట్ అనే ఆప్షన్‌పై మోర్‌పై ట్యాప్ చేయాలి. అప్పుడు మీకు మానిటైజేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. సైడ్ మెనూలో జాయిన్ అండ్ పేఅవుట్ సెటప్ అనే ఆప్షన్‌పైన క్లిక్ చేస్తే పేమెంట్ ప్రాసెస్ అవుతుంది. అప్పుడు ఎక్స్.కామ్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేందుకు అడిగిన వివరాల్ని ఎంటర్ చేయాలి.
ఇది పూర్తయితే వినియోగదారులకు X.COM క్రమం తప్పకుండా డబ్బులిస్తుంది. కనీసం 50 డాలర్లు ఉంటే ఎక్స్.కామ్ నుంచి డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. అర్హులైన యూజర్లు ప్రతినెలా చివరి వారంలో పేమెంట్స్ పొందొచ్చని తెలిపింది ఎక్స్.కామ్ యాజమాన్యం.
COMMENTS