McDonald's removed tomatoes from veggie pizza..!
వెజ్ పిజ్జా నుంచి టమోటాలను తొలగించిన మెక్ డోనాల్డ్స్..!
మెక్ డొనాల్డ్స్ అంటే టెస్టీ పిజ్జాలకు పెట్టింది పేరు. వెజ్, నాన్‌వెజ్‌లో ఇక్కడ బోలెడు వెరైటీలు ఉంటాయి. అయితే మీరు వెజిటెబుల్ పిజ్జా ఆర్డర్ చేస్తే ఇక ఆ టేస్ట్ రాకపోవచ్చేమో.. ఎందుకంటే.. వెజిటేబుల్ పిజ్జా నుంచి టమాట్‌ను తీసేసింది మెక్ డొనాల్డ్స్.. ఎందుకంటే పెరిగిన టమోటా ధరలే దానికి కారణం. టామోటా ధరలు కేజీ రూ. 100-400 పైనే ఉంటున్నాయి. 120- 200 రూపాయల పిజ్జాలో ఇంత ఖరీదైన టమోటాలు వేస్తే మాకేం మిగులుతుంది అనుకున్నారేమో.. ఇలా టమోటాలను ఎత్తేశారు.!
దేశంలోని చాలా ప్రాంతాల్లో మెక్ డొనాల్డ్స్ పిజ్జాల్లో టమాట ముక్కలు వేయడం లేదు. పెరిగిన ధరల వల్ల ఇలా చేయడం లేదని.. తమ నాణ్యతా ప్రమాణాలకు తగిన టమాట సరఫరా లేకపోవడమే ఇందుకు కారణమని సదరు రెస్టారెంటు చెబుతోంది. అందుకే మెనూలో వాటిని తొలగించామని వెల్లడించింది. ఈ మేరకు రెస్టారెంట్ల ముందు నోటీసులు అతికిస్తోంది. ఇందుకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
‘మేం ఎంత ప్రయత్నించినా ప్రపంచ స్థాయిలో ఉండే మా నాణ్యతా ప్రమాణాలకు దీటైన టమాటాలు దొరకడం లేదు. అందుకే మేం కొన్నాళ్లు టమాట లేని ఆహార ఉత్పత్తులను వడ్డించాల్సి వస్తోంది. వేగంగా టమాటాలను దిగుమతి చేసుకోవడానికి మేం కష్టపడుతున్నాం’ అని కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లలో నోటీసులు ప్రదర్శిస్తున్నారు. మెక్ డొనాల్డ్స్‌కు దేశంలో రెండు మాస్టర్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. సంజీవ్ అగర్వాల్ నేతృత్వంలోని ఎంఎంజీ గ్రూప్ ఉత్తర, తూర్పు భారతంలో రెస్టారెంట్లను నిర్వహిస్తుంది. బీజే లలిత్ నేతృత్వంలోని వెస్ట్ లైఫ్ గ్రూప్ దక్షిణ, పడమర భారతదేశంలో వ్యాపారం చేస్తుంది.
విపరీతమైన వడగాల్పులు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాల వల్ల దేశంలో టమాట దిగుబడి భారీగా పడిపోయింది. దాంతో అనేక నగరాల్లో కిలో టమాట రూ.150 వరకు పలుకుతోంది. బ్లింకిట్ వంటి ఆన్‌లైన్ గ్రాసరీ, వెజిటేబుల్ యాప్‌లో కిలో రూ.160 వరకు అమ్ముతున్నారు. సాధారణంగా జులై-ఆగస్టు నెలల్లో టమాట ధరలు పెరుగుతుంటాయి. వర్షాలు కురవడం వల్ల దిగుబడి పంట త్వరగా పాడువుతుంది.
మన దేశంలో 2016లో కొన్ని ప్రాంతాల్లో టమాట ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆ సందర్భంలోనూ మెక్ డొనాల్డ్స్ తమ మెనూలోంచి టమాటను కత్తించింది. ఇప్పుడు కూడా మళ్లీ ధరలు పెరగడంతో అదే పని చేసింది. సామాన్యప్రజలకు టమోటాలు, ఉల్లిపాయలు ఉంటే చాలు. కానీ ఇలా టమోటా ధరలు ఆకాశాన్ని అంటడంతో టమాటాలు లేకుండా కూరలు చేసుకుంటున్నారు.
COMMENTS