LIC Jeevan Labh: Rs. 54 lakhs per hand at once.. Amazing scheme.. How much to pay per day?
LIC Jeevan Labh: ఒకేసారి చేతికి రూ.54 లక్షలు.. అద్బుతమైన స్కీమ్.. రోజుకు ఎంత కట్టాలంటే?
LIC Jeevan Labh: మీరు జీవిత బీమాతో పాటు మరి రాబడి కోరుకుంటున్నారా? అయితే, ఇది మీకోసమే. ఒకసారి చేతికి రూ.54 లక్షలు అందుకోవచ్చు. భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ అద్భుతమైన పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో రోజుకు ఎంత కట్టాలి, ఎన్నేళ్లు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
LIC Jeevan Labh: భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ చాలా రకాల ఇన్సూరెన్స్ పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఈ పాలసీను రూపొందిస్తుంటుంది. వినియోగదారులు ఎంచుకునే ఎల్ఐసీ పాలసీ ఆధారంగానే వచ్చే బెనిఫిట్స్ సైతం ఉంటాయి. అందుకే పాలసీ ఎంచుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పాలసీ తీసుకున్నా కూడా దాని ప్రయోజనాలు పూర్తిగా పొందలేరు. ఎల్ఐసీ అందించే పాలసీల్లో జీవన్ లాబ్ ప్లాన్ ఒకటి. దీని ద్వారా పలు రకాల ప్రయోజనాలు అందుకోవచ్చు. ఒకేసారి రూ. 54 లక్షలు అందుకునేందుకు నెలకు ఎంత ప్రీమియం చెల్లించాలి అనే పూర్తి విషయాలు తెలుసుకుందాం.
ఎల్ఐసీ జీవన్ లాబ్ పాలసీ తీసుకోవడం ద్వారా జీవిత బీమా కవరేజీ ఉంటుంది. అలాగే సేవింగ్ ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి భారీ మొత్తం అందుకోవచ్చు. పాలసీదారుడు మరణిస్తే నామినీ లేదా కుటుంబ సభ్యులకు ఆర్థిక రక్షణ ఉంటుంది. ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ అనేది ఎండోమెంట్ ప్లాన్. దీని ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్, సేవింగ్స్ రెండూ కూడా పొందవచ్చు. పాలసీ టర్మ్ ముగిసిన తర్వాత పాలసీదారుడు జీవించి ఉంటే అప్పుడు వారికి ఒకేసారి భారీ మొత్తంలో నగదు అందుతుంది. ఈ పాలసీతో డెత్ బెనిఫిట, మెచ్యూరిటీ బెనిఫిట్, ట్యాక్స్ బెనిఫిట్, లోన్ ఫెసిలిటీ వంటి ప్రయోజనాలు పొందవచ్చు.
రూ. 54 లక్షలు రావాలంటే ఎంత కట్టాలి?
మీరు రూ.20 లక్షల బీమా కవరేజీ తీసుకుంటే మీ వయసు 30 ఏళ్లు అనుకుంటే మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.54 లక్షలు లభిస్తాయి. నెలవారీ ప్రీమియం వచ్చి రూ. 7,572గా ఉంటుంది. అంటే మీరు రోజుకు సుమారు రూ. 250 పొదుపు చేస్తే సరిపోతుంది. మీరు ఎంచుకునే బీమా మొత్తం ఆధారంగా మీ ప్రీమియం కూడా మారుతుంది. అంతేకాకుండా టెన్యూర్ ఆప్షన్ ద్వారా కూడా మీ ప్రీమియంలో మార్పు ఉంటుంది. 8 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు వయసు ఉన్న వారు ఈ ప్లాన్ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ 16 ఏళ్లు, 21 ఏళ్లు, 25 ఏళ్లుగా ఉంటుంది. 16 ఏళ్ల ప్లాన్ ఎంచుకుంటే 10 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. 21 ఏళ్ల ప్లాన్ తీసుకుంటే 15 ఏళ్లు కట్టాలి. ఇలా ఆరేళ్లు తక్కువగానే చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం కట్టడం ఆరేళ్లు ముందే ఆగిపోయినప్పటికీ ఇన్సూరెన్స్ కవరేజీ కొనసాగుతుంది. మెచ్యూరిటీ తర్వాత అన్ని ప్రీమియం మొత్తంతో పాటు బోనస్ లభిస్తుంది.
COMMENTS