Leaving corporate jobs and organic farming.. profits in crores..!
కార్పోరేట్ జాబ్స్ ని వదిలేసి ఆర్గానిక్ ఫార్మింగ్.. కోట్లలో లాభాలు..!
ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాలని వదిలేసుకుంటున్నారు. ఉద్యోగం కంటే కూడా వ్యవసాయం వ్యాపారం ఎక్కువ లాభాలని తీసుకువస్తాయని చాలామంది ఉద్యోగాలని వదులుకొని వచ్చేస్తున్నారు. అలాగే ఈ అన్నదమ్ములు కూడా ఉద్యోగాలని వదులుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ మీద దృష్టి పెట్టారు. కోట్లలో లాభాలని పొందుతున్నారు. ఇక ఈ సక్సెస్ స్టోరీ గురించి పూర్తి వివరాలు చూసేద్దాం.
పూణే యూనివర్సిటీ నుండి సత్యజిత్ అజంతా హంగే MBA పూర్తి చేసి ఆ తర్వాత టాప్ కంపెనీలో ఉద్యోగాన్ని పొందారు అయితే ఉద్యోగం కంటే కూడా పొలం పండించడంలో ఆనందం ఉందని తెలుసుకున్నారు. కార్పొరేట్ జాబులతో ఉద్యోగము చేసే విసిగిపోయి ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామని అనుకున్నారు ఈ సోదరులు. అయితే చాలామంది వ్యవసాయం చేయడం వలన ఎక్కువ డబ్బులు రావని వాళ్లకి చెప్పారు పైగా సిటీ లో చదువుకుని ఉద్యోగం వదిలేసుకుని ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేయడం ఏంటా అన్నారు కూడా. ఇలా ఎన్నో విమర్శలు వచ్చాయి అయినా కూడా వ్యవసాయం చేయాలని అనుకున్నారు.
ముందు కొంచెం భూమి తీసుకుని ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం మొదలుపెట్టారు 20 ఎకరాల్లో మూడు కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చింది. ఈ సోదరులు బియ్యం నెయ్యి పప్పులు, గుల్కండ్ లడ్డూలు వంటివి కూడా అమ్ముతారు. 14 దేశాల్లో వీళ్ళ ప్రొడక్ట్స్ సేల్ అవుతూ ఉంటాయి ఇలా ఇప్పుడు ఈ సోదరులు కార్పొరేట్ జాబ్ వదిలేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటూ కోట్లలో సంపాదిస్తున్నారు. నిజానికి ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం ఇలా ఎవరికి ఏది నచ్చితే దానిమీద దృష్టి పెట్టాలి కచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ ని అందుకోవచ్చు. చాలామంది మధ్యలోనే సక్సెస్ రాకపోవడంతో వదిలేయడం లేకపోతే అస్సలు కనీసం ప్రయత్నం చేయకపోవడం లాంటివి చేస్తారు. అలా కాకుండా కష్టపడి దేనినైనా నమ్ముకుని దృష్టి పెడితే సక్సెస్ ని పొందొచ్చు.
COMMENTS