Best Jobs: Have you completed your degree in journalism and mass communication? These are the top 5 career options for you.
Best Jobs: జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ డిగ్రీ పూర్తి చేశారా..? మీకు టాప్ 5 కెరీర్ ఆప్షన్స్ ఇవే..
ఒకప్పుడు ఇంటర్ పూర్తి చేసిన తర్వాత, చాలామంది విద్యార్థులు బీటెక్ లేదంటే ఎంబీబీఎస్ చదివేవారు. అకడమిక్ నాలెడ్జ్, కెరీర్ అవకాశాలు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు వంటివి ఏవీ విశ్లేషించకుండా ఈ రెండు రకాల కోర్సులకే ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అభిరుచులు, ఆసక్తులకు తగ్గట్లు అందుబాటులో ఉన్న కోర్సుల గురించి స్టూడెంట్స్ ఎంక్వైరీ చేస్తున్నారు. భవిష్యత్తులో సంతృప్తినిచ్చే కెరీర్‌ను ముందే సెలక్ట్ చేసుకుంటున్నారు. అయితే బుక్ రీడింగ్, రైటింగ్ అంటే ఇష్టం ఉన్న వారికి, కవితలు రాసేవారికి, న్యూస్ స్ట్రీమ్, మీడియాపై ఆసక్తి ఉన్న వారికి బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కోర్సు. డిగ్రీలో ఈ కోర్సు పూర్తి చేసిన వారికి అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో టాప్-5 కెరీర్ ఆప్షన్స్ ఏవో తెలుసుకుందాం.
ఫిల్మ్ మేకింగ్
ఫిల్మ్ మేకింగ్ మీ లక్ష్యం అయితే.. కాన్సెప్టులైజేషన్, ప్రొడక్షన్, రికార్డింగ్, ఎడిటింగ్ వంటివన్నీ తెలిసి ఉండాలి. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఫిల్మ్ స్టడీస్ విభాగంలో వీటన్నింటి గురించి నేర్పిస్తారు. ఆడియో/వీడియో స్టూడియో స్ట్రీమ్స్ అన్నీ కవర్ చేస్తారు. అనుభవం ఉన్న నిపుణుల గైడెన్స్‌లో విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన వారు డాక్యుమెంటరీ ఫిలిం మేకర్స్‌గా లేదా మెయిన్ స్ట్రీమ్ మూవీ డైరెక్టర్స్‌గా అవకాశాలు అందుకుంటారు.
జర్నలిజం
మీడియాలో సెటిల్ అవ్వాలనుకునే వారికి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్. ఈ కోర్సు పూర్తి చేసిన వారు ప్రముఖ మీడియా కంపెనీల్లో జర్నలిస్ట్‌గా పని చేయవచ్చు. ఏదైనా ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో న్యూస్ రిపోర్టర్‌గా, న్యూస్ రీడర్‌గా అవకాశాలు అందుకోవచ్చు. లేదంటే డిజిటల్ మీడియా కంటెంట్ రైటర్‌గా కూడా సెటిల్ అవ్వొచ్చు. ఈ రంగంలో ఫ్రీలాన్సింగ్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రముఖ విద్యాసంస్థల్లో ఈ కోర్సు పూర్తి చేసిన వారిని కొన్ని మీడియా కంపెనీలు క్యాంపర్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించుకుంటున్నాయి.
పబ్లిక్ రిలేషన్స్
ప్రస్తుత ప్రపంచంలో ప్రతి నేషనల్, మల్టీ నేషనల్ కంపెనీకి మంచి అర్హత కలిగిన PR ఆఫీసర్ అవసరం ఉంటోంది. ఆర్గనైజేషన్ నుంచి ఉద్యోగాలకు సమాచారాన్ని పంపే లింక్‌గా వీరి ఉద్యోగాలకు ప్రాధాన్యం ఏర్పడింది. పని పూర్తవ్వడానికి మెసేజ్‌లను చక్కగా తెలియజేయడం వీరి లక్ష్యం. మన దేశంలో ప్రైవేట్ కంపెనీల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, నిపుణులైన పీఆర్వోలకు డిమాండ్ పెరుగుతోంది.
అడ్వర్టైజింగ్
అడ్వర్టైజింగ్ ఉద్యోగాల్లో ప్రొడక్ట్ ప్రమోషన్ ప్రధాన లక్ష్యం. అభ్యర్థులు వస్తువుల అమ్మకానికి విజువల్, ఆడియో మార్కెటింగ్ టూల్స్ వినియోగిస్తారు. ఈ విభాగంలో ఉద్యోగాలు రెండు రకాలుగా ఉంటాయి. కాపీరైటర్, స్క్రిప్ట్ రైటర్, విజువలైజర్ వంటి క్రియేటివ్ జాబ్ ఆఫర్స్ అందుకోవచ్చు. లేదంటే క్లయింట్ సర్వీసింగ్, మార్కెట్ రిసెర్చ్‌పై పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల్లో సెటిల్ కావచ్చు.
రేడియో, వీడియో జాకీయింగ్
డిగ్రీలో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ చదివిన వారికి అందుబాటులో ఉన్న బెస్ట్ జాబ్ ఆప్షన్స్ ఇవి. ఈ ఫీల్డ్‌లో సక్సెస్ అవ్వాలంటే, మంచి ఎక్స్‌ప్రెస్సివ్‌గా ఉండాలి. వాయిస్ టోన్, మాటలతో ఆకట్టుకునే వారికి ఈ ఉద్యోగాలు మంచి సంతృప్తి ఇస్తాయి. మంచి ఆహార్యం ఉన్నవారికి ఆడిషన్స్‌లో వీడియో జాకీగా అవకాశాలు దక్కుతాయి. అందుకే ఈ జాబ్స్‌కు ఆడిషన్లో స్టూడెంట్ నాలెడ్జ్‌తో పాటు వస్త్రధారణకు కూడా ప్రాధాన్యం ఇస్తారు.v
COMMENTS