Inspiration: Read English Literature.. Even leave the job and make tea... If you see her idea, you will appreciate it..!
స్ఫూర్తి: చదివింది ఇంగ్లీష్ లిటరేచర్.. ఉద్యోగాన్ని కూడా వదిలేసుకొని టీ కొట్టు…ఆమె ఆలోచన చూస్తే మెచ్చుకుంటారు..!
జీతం ఎక్కువగా వస్తుందని నచ్చని పని చేయడం వలన రోజూ బాధ పడుతూనే ఉంటాము పైగా ఆ ఉద్యోగం చేస్తున్నందుకు ఏ మాత్రం సంతృప్తి మనలో ఉండదు. నిజానికి అలాంటి ఉద్యోగం చేయడం కంటే కూడా మనకి నచ్చినది చేయడంలోనే ఆనందం ఉంటుంది.
ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కలలు ఉంటాయి. ఆ కలలని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి కొందరు అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. జీతం ఎక్కువగా వస్తోందనో లేదంటే ఇతర కారణాల వలన కానీ నచ్చని ఉద్యోగం చేస్తూ ఉంటారు. కానీ ఈమె మాత్రం ఆ తప్పు చేయలేదు. నిజానికి ఉద్యోగం చిన్నది పెద్దది అనే తేడా లేదు.
మన కలల్ని నెరవేర్చుకోవడమే మంచిది. సంజయ్ కన్నా అనే ఒక వ్యక్తి ఒక పోస్ట్ చేసారు. ఆ పోస్ట్ ని చూస్తే మీరు కూడా మెచ్చుకుంటారు. సంజయ్ కన్నా ఒక టీ కొట్టు దగ్గరికి వెళ్లారు. ఇది ఢిల్లీ లో ఉంది. అయితే అక్కడ ఒక అమ్మాయి టీ ని అమ్ముతోంది ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడడంతో ఆశ్చర్యంగా అనిపించి మాట్లాడడం మొదలుపెట్టారు సంజయ్.
ఆమె పేరు శర్మిష్టా గోష్. ఇంగ్లీషులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఆ తర్వాత అబ్రిటీష్ కౌన్సిల్ లైబ్రరీ లో ఆమె పనిచేసింది. అయితే ఆమె తన కలల కోసం ఆలోచించనప్పుడు ఈ ఉద్యోగం చేసింది తర్వాత ఆమె తన కలని నెరవేర్చుకోవడం కోసం ఉద్యోగాన్ని వదిలేసి టీ కొట్టు మొదలు పెట్టింది.
తన స్నేహితురాలు భావన రావుతో కలిసి ఆమె ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు ఎప్పుడు కూడా ఏ ఉద్యోగము లో కూడా చిన్నది పెద్దది అని ఉండదు నచ్చినది చేస్తేనే సంతృప్తి కలుగుతుంది. పైగా నచ్చని ఉద్యోగంలో ఎంత జీతం వచ్చినా సరే అది వృధానే.. పైగా నచ్చిన దాని కోసం కష్టపడటంలో తప్పులేదు.
చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అని ఏమీ ఉండదు కాబట్టి మీరు మీకు నచ్చిన దానిని అనుసరించండి ఇతరులు మీ గురించి ఏమనుకుంటారు అనేది అస్సలు వద్దు. ఈమెలానే ప్రతి ఒక్కరు వాళ్ళ కలలని నెరవేర్చుకోవాలి ఏమని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా ముందుకు వెళ్ళండి ఆనందం ఎందులో దొరుకుతుందో దానిని కొనసాగించండి.
COMMENTS