Inspiration: Give up a high paying job and earn Rs. 15 lakh per year with agriculture!
స్ఫూర్తి: ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని.. వ్యవసాయం తో ఏడాదికి రూ.15 లక్షలు..!
ప్రతి ఒక్కరు కూడా జీవితంలో పైకి రావాలని సక్సెస్ ని అందుకోవాలని అనుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. నిజానికి సక్సెస్ పొందాలన్నా అనుకున్నది సాధించాలన్న ఎంతో కష్టపడాలి. ఈ వ్యక్తి ఉద్యోగాన్ని వదిలేసుకుని వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. ఇక ఆయన సక్సెస్ స్టోరీ ని చూద్దాం.. చేతన్ శెట్టి ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా వదిలేసుకుని మంగళూరులోని వ్యవసాయాన్ని మొదలుపెట్టారు ఆయన వయసు 35 సంవత్సరాలు. అనుకున్నది సాధించాలని తన కలల్ని నెరవేర్చుకోవాలని వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. 2017లో బెంగళూరుకి దూరంగా ఉండే బళ్లారి దగ్గరికి వచ్చేసారు ఇది మంగళూరు సిటీకి దగ్గరగా ఉంటుంది.
అక్కడ ఆయన అరటి పండ్లు బొప్పాయి పండ్లు ద్రాక్ష పండ్లను పండిస్తున్నారు. ఇలా చాలా చెట్లు వాళ్ళ పొలంలో ఉన్నాయి. అవకాడో కొబ్బరి మామిడి మొదలైన చెట్లు కూడా ఉన్నాయి. కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్నప్పుడు కార్పొరేట్ ఉద్యోగం తనకి మంచిది కాదని వ్యవసాయం చేసి మంచిగా పండించాలని అనుకునేవారు. తన తాత గారిని స్ఫూర్తిగా తీసుకుని వ్యవసాయంలోకి వచ్చారు. ఉద్యోగం చేస్తున్నప్పుడే పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టారు. పది ఎకరాల భూమిలో దున్నడం మొదలుపెట్టి ఇప్పుడు కొన్ని లక్షల రూపాయల్ని సంపాదిస్తున్నారు.
మొదట పండించడం కోసం 10 లక్షల రూపాయలని ఖర్చు పెట్టాల్సి వచ్చింది. సంపాదన వచ్చే వరకు కూడా ఎదురు చూశారు. తన కుటుంబ సభ్యులతో తానే పంటలను పండించడం ఆ పంటను కోయడం వంటివి చేశారు. ఇప్పుడు తాను బెంగళూరు ముంబై పూణే ఢిల్లీ అమృత్సర్ హైదరాబాద్ వంటి నగరాలకు పండ్లను సప్లై చేస్తున్నారు. గత ఏడాది 15 లక్షల రూపాయలని సంపాదించారట. సుమారు 5200 కేజీలని ప్రొడ్యూస్ చేశారు. ఇది కదా సక్సెస్ అంటే… సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి ఒక రైతుగా చేతన్ శెట్టి సక్సెస్ అయ్యారు.
COMMENTS