Inspiration: A business that started in the kitchen.. is now profiting in crores..!
స్ఫూర్తి: వంటగదిలో మొదలు పెట్టిన బిజినెస్.. ఇప్పుడు కోట్లలో లాభం..!
చాలా మందికి ఏదైనా సాధించాలని ఉంటుంది కానీ కనీసం ప్రయత్నం కూడా చేయరు నిజానికి జీవితం లో ముందుకు వెళ్లాలన్నా సక్సెస్ అవ్వాలన్నా ప్రయత్నం అనేది చాలా ముఖ్యం ప్రయత్నం చేస్తే కచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ ని అందుకోవచ్చు. అయితే వయసుతో కూడా సక్సెస్ కి సంబంధం లేదు. అందుకు ఉదాహరణ ఐదు పదులు దాటిన కమల్ జిత్ కౌర్. మరి ఇక ఆమె సక్సెస్ స్టోరీ ని చూద్దాం..
కరోనా మహమ్మారి వచ్చి అందరినీ ఎంతో ఇబ్బంది పెట్టేసింది. కరోనా మనల్ని పట్టి పీడిస్తున్న సమయంలో పంజాబ్ లుథియానా లోని చిన్న గ్రామంలో పుట్టిన కమల్‌జిత్ వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది. ఈరోజుల్లో ఎక్కడ చూసినా కల్తీ ఆహారమే ఉంటోంది. ఇదివరకు తిన్న నాణ్యమైన ఆహార పదార్థాలు దొరకడం లేదని ఒక నిర్ణయానికి వచ్చింది చిన్నప్పటినుండి కల్తీ లేని నెయ్యి పాలు వంటివి తీసుకునేది ఈమె అయితే ఇటువంటివి అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు.
ఎలాంటి కల్తీ లేకుండానే నెయ్యి ని తయారు చేయాలని ఈమె నిర్ణయించుకున్నారు ఆవు పాలని మరిగించి చల్లబరిచేందుకు.. నెయ్యిని తయారు చేయడానికి బిలోనా అనే ఒక పద్ధతిని ఈమె ఉపయోగించారు. ఈమె నెయ్యి కి డిమాండ్ బాగా పెరిగింది ప్రపంచ దేశాల్లోనే చాలామంది ప్రజలు ఆర్డర్ చేయడం మొదలుపెట్టారు.
220 మిల్లు లీటర్లు 500 మిల్లీలీటర్లు ఒక లీటర్ పరిణామాల్లో ఈ నెయ్యి లభిస్తాయి. కిమ్ముస్ కిచెన్ సంపాదన నెలకు 20 లక్షల కంటే ఎక్కువే వీళ్ళ సంపాదనలో ఒక శాతం గురుద్వారికి ఆకలి తో ఉన్న వాళ్ళకి అందిస్తున్నారు. చూశారు కదా ప్రయత్నం చేస్తే సాధించ లేనిది అంటూ ఏమీ ఉండదు. మరి ఈమె ని ఆదర్శంగా తీసుకుని మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ ని అందుకోవచ్చు.
COMMENTS