These are the most innovative companies in 2023!
2023లో మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీలు ఇవే!
వినూత్న ఆలోచనలతో, సరికొత్త టెక్నాలజీ ఉపయోగిస్తూ, వినియోగదారులకు కొత్త విషయాలను పరిచయం చేస్తూ ముందుకు సాగే కంపెనీలను మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీలుగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రకారం ఈ ఏడాది మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీలు.
యాపిల్
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ అంటే తెలియని వారుండరు. ఈ ఏడాది మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీల జాబితాలో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉంది.
టెస్లా
ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సరికొత్త టెక్నాలజీతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఆటో మొబైల్ ఇండస్ట్రీలో సరికొత్త పోకడలతో ఈ ఏడాది మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.
అమెజాన్
వినియోగదారుల సౌకర్యం కోసం సరికొత్త మార్గాలను వెతుకుతోంది అమెజాన్. ఈ నేపథ్యంలోనే 2023లో మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీల జాబితాలో అమెజాన్ కంపెనీ మూడో స్థానంలో నిలిచింది.
ఆల్ఫాబెట్
గూగుల్ యొక్క హోల్డింగ్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ కూడా ఈ లిస్టులో ఉంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రకారం మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది.
మైక్రోసాఫ్ట్
మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీల జాబితాలో ఆల్ఫాబెట్ తర్వాత ఐదో స్థానంలో కొనసాగుతోంది మైక్రోసాఫ్ట్. ప్రతి ఏడాది ఈ సంస్థ జాబితాలో చోటు పొందుతూ వస్తోంది.
మోడెర్నా
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకుంటూ ముందుకు సాగుతోంది ఫార్మా కంపెనీ మోడెర్నా. క్యా్న్సర్ ట్రీట్‌మెంట్‌తో పాటు వ్యాక్సిన్ల తయారీలో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తూ మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది.
శామ్‌సంగ్
స్మార్ట్ హోమ్ ప్రోడక్ట్స్, వర్చువల్ అసిస్టెన్స్, రొబోటిక్స్, మెడికల్ ఎక్విప్‌మెంట్, విస్తృత 5జీ కనెక్టివిటీని ఉపయోగిస్తూ శామ్‌సంగ్ కూడా ఇన్నోవేటివ్ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటిగా ఉంది.
హ్యువాయ్, టాటా
మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీల జాబితాలో హ్యువాయ్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ జాబితాలో టాటా గ్రూప్ 20వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ కంపెనీ కూడా ఇదే.
COMMENTS