Indian Coast Guard: Jobs in Indian Coast Guard.. How to Apply..
Indian Coast Guard: ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..
నిరుద్యోగులకు శుభవార్త. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) వివిధ ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇది సముద్ర చట్టాన్ని అమలు చేసే సంస్థ. రెస్క్యూ ఆపరేషన్స్, సముద్ర సరిహద్దు భద్రత, సముద్ర కాలుష్యాన్ని నిరోధించడం వంటి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రస్తుతం సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ (OG), మోటర్ ట్రాన్స్పోర్ట్ ఫిట్టర్ (మెకానికల్), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (మోటార్ ట్రాన్స్పోర్ట్ క్లీనర్) సహా వివిధ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న వ్యక్తులు ఆగస్టు 14లోగా అధికారిక వెబ్సైట్https://indiancoastguard.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి..
ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రకటించిన ఖాళీలకు అప్లై చేసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు.
ఖాళీలు
సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ (OG): ఈ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది. OBC కేటగిరీకి చెందిన అభ్యర్థులకు అప్లై చేసుకోవచ్చు.
మోటార్ ట్రాన్స్పోర్ట్ ఫిట్టర్ (మెకానికల్): ఇవి రెండు పోస్టులు అందుబాటులో ఉన్నాయి. రెండు ఖాళీలను అన్రిజర్వ్డ్ (UR) కేటగిరీలోని అభ్యర్థులకు కేటాయించారు.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (మోటార్ ట్రాన్స్పోర్ట్ క్లీనర్): ఈ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి. ఒకటి అన్రిజర్వ్డ్ (UR) కేటగిరీ అభ్యర్థులకు, మరొకటి SC వర్గానికి చెందిన అభ్యర్థులకు రిజర్వ్ చేశారు.
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (మాలి): ఈ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది. SC వర్గానికి చెందిన అభ్యర్థులకు రిజర్వ్ చేశారు.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ప్యూన్): ఈ పోస్టులు రెండు ఉన్నాయి. ఒకటి ఆర్థికంగా వెనుకబడిన విభాగం (EWS) కేటగిరీ అభ్యర్థులకు రిజర్వ్ చేశారు. మరొకటి SC వర్గానికి చెందిన అభ్యర్థులకు రిజర్వ్ అయింది.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (స్వీపర్): ఈ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి. ఒకటి అన్రిజర్వ్డ్ (UR) కేటగిరీలో ఉంది. మరొకటి OBC వర్గానికి చెందిన అభ్యర్థులకు కేటాయించారు.
సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ (OG) జాబ్‌కి అప్లై చేసే అభ్యర్థులకు మోటారు మెకానిజమ్‌లపై అవగాహన ఉండాలి. వివిధ వాహనాలను నడపగల సామర్థ్యం అవసరం. మోటార్ ట్రాన్స్పోర్ట్ ఫిట్టర్ (మెకానికల్) రోల్‌కి అప్లై చేసే వారికి తప్పనిసరిగా వాహనాలను మెయింటైన్ చేయడంలో, పెట్రోల్, డీజిల్ ఇంజిన్లను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (మోటార్ ట్రాన్స్పోర్ట్ క్లీనర్) అభ్యర్థులు గదులు, ఫర్నిచర్, భవనాలు శుభ్రపరచడం, జనరల్ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా మోటారు వాహనాలకు సంబంధించిన బాధ్యతలు చూస్తారు.
సెలక్షన్ ప్రాసెస్..
అప్లికేషన్లను షార్ట్‌లిస్ట్ చేసి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారు. వారి స్కోర్ల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను రూపొందిస్తారు.
దరఖాస్తు విధానం..
-దరఖాస్తుదారులు సూచించిన ఫార్మాట్‌ను అనుసరించి ఇంగ్లీష్ లేదా హిందీలో అప్లికేషన్ ఫారమ్‌ను పూరించాలి.
-సెల్ఫ్- అటెస్టెడ్ కలర్ ఫోటోగ్రాఫ్‌ను అంటించాలి.
-మెట్రిక్యులేషన్ మార్క్ షీట్, సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్ (వర్తిస్తే), ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వంటి అవసరమైన డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలను అందించాలి.
-అదనంగా రూ.50ల పోస్టల్ స్టాంపులలో ప్రత్యేక బ్లాంక్ ఎన్వలప్ ఉంచాలి.
-దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లోనే సమర్పించాలి.
-పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్‌ను డైరెక్టర్ జనరల్, కోస్ట్ గార్డ్ హెడ్‌క్వార్టర్స్, డైరెక్టరేట్ ఆఫ్ రిక్రూట్మెంట్, C-1, ఫేజ్ II, ఇండస్ట్రియల్ ఏరియా, నోయిడా, UP-201309కు పంపాలి.
Important Links:
FOR WEBSITE CLICKHERE
COMMENTS