IPPB Recruitment 2023: Notification for jobs in India Post Payments Bank..Applications from today..Details
IPPB Recruitment 2023: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఈ రోజు నుంచే అప్లికేషన్లు.. వివరాలివే
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 132 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూలై 26.. అంటే ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 16ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.30 వేల వేతనం ఉంటుంది. వేతనంతో పాటు పలు రకాల అలవెన్సులు కూడా అందుబాటులో ఉంటాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.ippbonline.com/ను సందర్శించడం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
రాష్ట్రాల వారీ ఖాళీలు
S.No. రాష్ట్రం ఖాళీలు
1. అస్సాం 26
2. ఛత్తీస్‌గఢ్ 27
3. హిమాచల్ ప్రదేశ్ 12
4. జమ్మూ & కాశ్మీర్ 7
5. లడఖ్ 1
6. అరుణాచల్ ప్రదేశ్ 10
7. మణిపూర్ 9
8. మేఘాలయ 8
9. మిజోరం 6
10. నాగాలాండ్ 9
11. త్రిపుర 5
12. ఉత్తరాఖండ్ 12
మొత్తం: 132
విద్యార్హత:
ఎగ్జిక్యూటివ్ పోస్టుకు రిక్రూట్‌మెంట్ కోసం, అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. సేల్స్/ఫైనాన్షియల్ ప్రొడక్ట్ ఆపరేషన్స్‌లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
వయోపరిమితి:
ఎగ్జిక్యూటివ్ పోస్టు రిక్రూట్‌మెంట్ కోసం, కనీస వయస్సు 21 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు (జనరల్ కేటగిరీ)గా నిర్ణయించారు. నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.
దరఖాస్తు రుసుము:
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు - రూ. 100,
ఇతర వర్గాలకు రూ. 300
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR APPLY CLICKHERE
COMMENTS